అందరిలో మంచిని చూడటం నేర్చుకుందామన్న పొప్ ఫ్రాన్సిస్

జెమెల్లి ఆసుపత్రిలో కోలుకుంటున్న పోప్ ఫ్రాన్సిస్ మార్చ్ 2,2025 ఆదివారం త్రికాల ప్రార్థన ప్రసంగాన్ని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ విడుదల చేసింది.
తన సందేశంలో, ప్రపంచ శాంతి కోసం నిరంతర ప్రార్థనలను కోరారు.
ఆదివారం సువార్త పఠనాన్ని వివరిస్తూ అందరిలో మంచిని చూడటానికి, మరియు పొరుగు వారిని ప్రేమతో చూడడానికి మన కళ్ళకు శిక్షణ ఇవ్వాలని పోప్ ఫ్రాన్సిస్ కోరారు.
మన చూపులో కరుణ, మాటల్లో ప్రేమ, సత్యము ఉండాలని తెలియపరుస్తున్నాయని ,మంచి చెట్లు ఏ విధంగా అయితే మంచి ఫలాలను ఇస్తాయో, మనం మాట్లాడే ప్రేమతో కూడిన మాటలు పొరుగువారి హృదయాలకు తీయదనాన్ని చేకూరుస్తాయని,
నిజమైన క్రైస్తవులు అసందర్భముగా మాట్లాడారని ,తమ మాటను క్రీస్తు ప్రేమను వ్యాప్తి చేయడానికి, మంచిని బోధించడానికి ఉపయోగిస్తారని ఆయన అన్నారు.
అదేవిధంగా తన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి విశ్వాసికి,తనకు చికిత్సను అందిస్తున్న ఆసుపత్రి సిబ్బందికి పొప్ ధన్యవాదాలు తెలియపరిచారు.