రోడ్డు భద్రతపై అవగాహన పాఠశాలల్లోనే ప్రారంబించాలన్న పొప్ ఫ్రాన్సిస్

జనవరి 23, గురువారం వాటికన్‌లోని ఇటాలియన్ ఫెడరేషన్ ఆఫ్ ది ఆటోమొబైల్ క్లబ్ అధ్యక్షులు మరియు డైరెక్టర్లతో పోప్ ఫ్రాన్సిస్ సమావేశమైయ్యారు 

పర్యావరణాన్ని పరిరక్షణ అవగాహనా మరియు దానిని పరిరక్షించడం మెరుగైన భవిష్యత్తును అందించడానికి దోహదపడే రెండు రంగాలని పొప్ ఫ్రాన్సిస్ సూచించారు.

ఇటాలియన్ ఫెడరేషన్  అఫ్ ది ఆటోమొబైల్  క్లబ్ వారు గత 120 సంవత్సరాలుగా "పౌరులకు  సేవ చేస్తునందుకు" పోప్ కృతజ్ఞతలు తెలిపారు.

మారుతున్న యుగంలో "ప్రజల శ్రేయస్సు మరియు వారి భద్రతపై కేంద్రీకృతం చేస్తూ నిరంతర నిబద్ధతను ఆయన ప్రశంసించారు.

ఈ జూబ్లీ సంవత్సరం ప్రతి ఒక్కరికీ ఒక నూతన ప్రారంభమని,మనం నిశ్చలంగా ఉండటానికి కాదుకానీ సంతోషాన్ని కోరుకునే వారిగా జీవించాలని పోప్ ఫ్రాన్సిస్ ప్రోత్సహించారు. 

పర్యావరణం గురించి  మాట్లాడుతూ, వాహనాల సంఖ్య, పునరుత్పాదక శక్తి వినియోగం, ఇంధన దర, కాలుష్యం మరియు ట్రాఫిక్ అనేవి మన నివాసాలు మరియు దానిలో జీవించే ప్రజలపై ప్రభావం చూపే అంశాలు అని పొప్ ఫ్రాన్సిస్ తెలిపారు 

"జీవన నాణ్యత ప్రమాదంలో ఉంది" ఆయన హెచ్చరించారు.

ఈ సవాళ్లను దృఢ సంకల్పంతో ఎదుర్కోవడం, స్థిరత్వాన్ని ప్రోత్సహించడం అత్యవసరమని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు.

ఇటాలియన్ ఫెడరేషన్ ఆఫ్ ది ఆటోమొబైల్ క్లబ్ వారి కుటుంబాలను మరియు వారి పనిని వాహనదారుల పోషకుడైన సెయింట్ క్రిస్టోఫర్‌కు సమర్పిస్తూ, వీరిని ఆశీర్వదించి,తన కోసం ప్రార్థించమని వారిని ఆహ్వానిస్తూ సమావేశాన్ని పొప్ ముగ్గించారు.