మన గృహం - భూగ్రహం | Water |
'మనిషి జీవించడానికి గాలి, నీరు, ఆహారం అత్యంత అవసరం. వీటిలో నీరు లేకుండా జీవితం అసాధ్యం. ప్రకృతి మనకు ఉచితంగా అందిస్తున్న అమూల్యమైన సంపద నీరు. అయితే ప్రపంచంలో ఒక నీటి సీసా ధర అక్షరాలా రూ.50 లక్షలు అంటే నమ్మగలమా?
అవును! ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అక్వా డి క్రిస్టల్లో"అనే విలాసవంతమైన వాటర్ బాటిల్ ధర అక్షరాలా 50 లక్షలు. అది కూడా కేవలం (750 ml) నీటికే.
ఒకవైపు ప్రపంచంలో కొందరు లక్షల రూపాయలు పెట్టి నీటిని కొనుగోలు చేస్తుంటే, మరోవైపు కోట్లాది మంది ప్రజలు తాగడానికి స్వచ్ఛమైన నీరు దొరకక ఇబ్బందులు పడుతున్నారు.
నదులు కలుషితమవుతున్నాయి. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు నీటి వనరులను కలుషితం చేస్తున్నాయి. వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడంలో మనం నిర్లక్ష్యం చేస్తున్నాం.నీటిని వృథా చేయడం అంటే మన భవిష్యత్తును వృథా చేయడమే.
Content, presentation, camera and Editing by M Kranthi Swaroop
