ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు సత్వర చర్యలు అవసరమన్న పోప్
పోప్ లియో ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు సంబంధిత పక్షాలు చర్చలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఆదివారం అక్టోబర్ 1 న జరిగిన త్రికాలప్రార్థన అనంతరం ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.
రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్లోని Oleshkyపట్టణం నుంచి ఇటీవల ప్రత్యేక మానవతా కాల్పుల విరమణ ద్వారా వందలాది మంది పౌరులను సురక్షితంగా తరలించారు.
ఈ మానవతా కార్యక్రమం సాధ్యమయ్యేందుకు పోప్ లియో , అమెరికా ప్రథమ మహిళ Melania Trump దౌత్యపరమైన ప్రయత్నాలు చేశారు.
తరలింపు కార్యక్రమంతో పాటు అక్కడే ఉన్న ప్రజలకు ఆహారం, తాగునీరు, వైద్య సామగ్రిని కూడా అందించారు.
ఈ సహకారం మరిన్ని శాంతి ప్రయత్నాలకు మార్గం చూపాలని, చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని పోప్ ఆకాంక్షించారు.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల వల్ల బాధపడుతున్న వారందరినీ మరియమ్మకు ప్రార్థనాపూర్వకంగా పోప్ సమర్పించారు.
