తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఎండలు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్న ప్రజలు. ఈ క్రమంలో ఏపీ వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం, మంగళవారం ఏపీలోని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని ప్రజలను హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవసరమైతేనే బయటకు వెళ్లాలంటూ సూచించింది.
తెలంగాణలో నేడు, రేపు 41-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.