సంఘర్షణా ప్రాంతాలలో శాంతి కొరకు ప్రార్థించాలని పిలుపునిచ్చిన పోప్
ఆదివారం జనవరి 25 త్రికాల ప్రార్థన ప్రసంగంలో ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని కోరారు మరియు సంఘర్షణతో ప్రభావితమైన ఇతర ప్రాంతాలలో శాంతి స్థాపనకు ప్రార్థన విజ్ఞప్తిని పునరుద్ఘాటించారు.
"ఈ రోజుల్లో కూడా, ఉక్రెయిన్ నిరంతర దాడులకు గురవుతూనే ఉంది, మొత్తం జనాభా శీతాకాలపు చలికి గురవుతోంది" అని పోప్ పేర్కొన్నారు.
దీర్ఘకాలిక సంఘర్షణ "పౌరులకు మరింత తీవ్రమైన పరిణామాలకు కారణమవుతుందని, ప్రజల మధ్య అంతరాన్ని విస్తరిస్తుంది మరియు న్యాయమైన మరియు శాశ్వత శాంతిని మరింత దూరం చేస్తుంది" అని అన్నారు
"యుద్ధాన్ని ముగించడానికి ప్రతి ఒక్కరూ తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని నేను కోరుతున్నాను" అని పొప్ విజ్ఞప్తి చేశారు.
అమెరికా ప్రోత్సాహంతో అబుదాబిలో ఉక్రెయిన్ మరియు రష్యా మధ్యవర్తులు ముఖాముఖి చర్చలు జరపనున్న తరుణంలో పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్ నగరాలు మరియు మౌలిక సదుపాయాలపై వరుసగా జరిగిన ప్రాణాంతక దాడులు జరిగినప్పటికీ, వచ్చే వారాంతంలో అమెరికా మధ్యవర్తిత్వంతో రెండో విడత ప్రత్యక్ష శాంతి చర్చలు జరపడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్లు సమాచారం.