లెబనన్ ప్రధాన మంత్రితో సమావేశమైన పోప్ లియో
అక్టోబర్ 25న, లెబనన్ ప్రధాన మంత్రి Nawaf Salam, ఉప ప్రధాన మంత్రి Tarek Mitriతో పోప్ లియో సమావేశమైనట్లు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ ప్రకటించారు
వీరు పోప్ తో సమావేశమైన తరువాత హోలీ సీ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో సమావేశమయ్యారు, వీరితో పాటు రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో హోలీ సీ సంబంధాల కార్యదర్శి ఆర్చ్ బిషప్ పాల్ రిచర్డ్ కూడా ఉన్నారు.
సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో జరిగిన సమావేశంలో, రెండు పార్టీలు అనగా హోలీ సీ మరియు లెబనన్ మధ్య మంచి సంబంధాల" పట్ల సంతృప్తి వ్యక్తం చేశాయని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ తెలిపింది.
2025 నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు పోప్ లెబనాన్‌కు చేయబోయే పర్యటనను గురించి చర్చించారు
దేశ సంస్కరణ మరియు స్థిరీకరణ ప్రక్రియలో లెబనీస్ ప్రజలు ఆశలు", అలాగే లెవాంట్ లో శాంతి స్థాపన సాధించబడుతుందనే ఆశను వ్యక్తపరిచారు.