న్యూ గినియా కతోలికులు విశ్వాసం, ఐక్యతను స్వీకరించాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు కోరారు
న్యూ గినియా కతోలికులు విశ్వాసం, ఐక్యతను స్వీకరించాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు కోరారు
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సెప్టెంబరు 8న అధిక సంఖ్యలో పాపువా న్యూ గినియా కతోలికుల కోసం బహిరంగ దివ్యబలి పూజను నిర్వహించారు. విశ్వాసానికి దగ్గరవ్వాలని "ప్రపంచం అంచున ఉన్న" ఈ దేశాన్ని వేడుకున్నారు.ఈ పార్థనలలో సుమారు 35,000 మందికి పైగా పాల్గొన్నారు.
న్యూ గినియాలోని పోర్ట్ మోర్స్‌బీలోని సర్ జాన్ గైస్ స్టేడియంలో జరిగింది ఈ కార్యక్రమంలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు శక్తివంతమైన ప్రసంగాన్ని అందించారు. పాపువా న్యూ గినియా ప్రజలు తమ హృదయాలను దేవునికి తెరవాలని, భయాన్ని పక్కన పెట్టి, మరింత ఐక్య సమాజాన్ని నిర్మించాలని కోరారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడుతూ "బలంగా ఉండండి, భయపడకండి!" (యెషయా 35:4), కష్టాలలో మరియ ఎవరు లేని ఒంటరి వారిని రక్షించే దేవుని శక్తిపై నిరీక్షణను ఉంచాలని కోరారు.
సెప్టెంబరు 8న మరియమాత పుట్టిన రోజు సందర్భముగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడుతూ "మీ దైనందిన క్రైస్తవ జీవితాల్లో బలం మరియు ఓదార్పుని పొందడానికి క్రైస్తవుల సహాయమాత మరియమాత ద్వారా సహాయం పొందాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను" అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer