ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైన పోప్ లియో

డిసెంబర్ 9 ఉదయం కాస్టెల్ గాండోల్ఫో పాపల్ నివాసంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పోప్ లియోను కలిసారు 

ఉక్రెయిన్‌లో యుద్ధంపై చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ ఈ స్నేహపూర్వక సమావేశాన్ని వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు న్యాయమైన మరియు శాశ్వత శాంతికి దారితీస్తాయని వారు వెల్లడించారు

ఇద్దరు దేశాధినేతలు యుద్ధ ఖైదీల సమస్య గురించి కూడా మాట్లాడారు, ఉక్రేనియన్ పిల్లలు వారి కుటుంబాలకు సురక్షితంగా తిరిగి వచ్చేలా చూడాలని పిలుపునిచ్చారు.

సరిగ్గా ఐదు నెలల క్రితం, అధ్యక్షుడు జెలెన్స్కీ పోప్ లియోతో కాస్టెల్ గాండోల్ఫోలో సమావేశమయ్యారు - ఆ సమయంలో ఇలాంటి అంశాలు చర్చించబడ్డాయి.

జూలై సమావేశంలో, పోప్ లియో యుద్ధ బాధితుల పట్ల తన విచారాన్ని వ్యక్తం చేశారు మరియు ఉక్రెయిన్ ప్రజలకు కొరకు నిరంతర ప్రార్థనల హామీ ఇచ్చారు.

ఉక్రెయిన్ మరియు రష్యా రెండింటినీ సంభావ్య చర్చల కోసం ఆతిథ్యం ఇవ్వడానికి వాటికన్ సుముఖతను పోప్ పునరుద్ఘాటించారు.

పోప్ తో సమావేశం తరువాత, అధ్యక్షుడు జెలెన్స్కీ ఆంగ్లములో పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడుతూ  ప్రేక్షకులకు మరియు ముఖ్యంగా ఉక్రేనియన్ పిల్లల పునరాగమనం విషయంలో పోప్ మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.