విజయవంతంగా YU4C కోఆర్డినేటర్ల సమావేశాలు

విజయవంతంగా YU4C కోఆర్డినేటర్ల సమావేశాలు

విజయవాడ  మేత్రాసనంలో "జాతీయ క్యాథలిక్ కరిస్మాటిక్ రిన్యూవల్" యువతా విభాగమైన 'యూత్ యునైటెడ్ ఫర్ క్రైస్ట్ ' కి చెందిన వివిధ రాష్ట్రాల కోఆర్డినేటర్ల సమావేశాలు మార్చి 22 ,23 ,24 తేదీలలో " సెయింట్ ఆన్స్ సిస్టర్స్ ఆఫ్ ప్రొవిడెన్సు" వారి కాన్వెంటు లో విజయవంతం గా జరిగాయి .             

 జాతీయ  YU4C కోఆర్డినేటర్ అయిన సహోదరుడు అజిన్ జోసెఫ్, సిస్టర్ పౌలినా, సిస్టర్ స్వప్న మరియు CHARIS నేషనల్ సర్వీసు ఆఫ్ కమ్యూనియన్ సభ్యురాలు సహోదరి మేరీ ప్రకాషి గార్ల ఆధ్వర్యం లో ఈ సమావేశాలు నిర్వహించబడినవి .

వివిధ రాష్ట్రాలకు చెందిన యువత నాయకులు  పాల్గొన్నఈ సమావేశాలలో  గుంటూరు పీఠాధిపతులు  మహా పూజ్య  భాగ్యయ్య గారు పాల్గొని ప్రారంభ  దివ్యబలిపూజను సమర్పించారు.    మహా పూజ్య  భాగ్యయ్య గారు మాట్లాడుతూ "క్రెస్తవ యువ కిశోరాలే ప్రస్తుత ఆశా కిరణాలు ' అని అన్నారు .


పవిత్రాత్మ ప్రేరణతో ,చక్కని విధాన నిర్ణయాలతో జరిగినటు వంటి ఈ మూడురోజుల సమావేశాలలో ముఖ్యంగా  "ఏసుతో ముందుకు సాగుదాం " అను నినాదంతో  అక్టోబరు31, 2024 నుంచి నవంబరు 3,2024 వరకు పాండిచేరీలో జరుగబోవుచున్న "YU4C కైరోస్ 2024 "
సదస్సులకు భారత క్రెస్తవ యువతను పాల్గొని  విషయముపై  చర్చలు ఫలవంతంగా జరిగాయి. మహా పూజ్య  భాగ్యయ్య గారు, వంద మందిని ఈ సదస్సులకు పంపిస్తామని వాగ్దానం చేశారు. అనంతరం తెలుగు ప్రేయర్ కార్డుని ఆవిష్కరించారు .

మూడవ రోజున విజయవాడ పీఠాధిపతులు మహా పూజ్య జోసెఫ్ రాజారావు గారిని యువత నాయకులు కలవడం జరిగింది.  వారుకూడా కనీసం 50 మంది యవ్వనులను కైరోస్ 2024 సదస్సులకు పంపిస్తామని చెప్పారు.

  ఈ మూడు రోజుల సదస్సులో యూత్ డైరెక్టర్లను ,మరియు పలు సంస్థల పెద్దలను కలిసి ,వారితో సంప్రదింపులు జరిపి ,ముందు కాలంలో తెలుగు నాట శ్రీసభ యువతా కార్యక్రమాలను ఎలా నిర్వహించాలి అను అంశం పై కొన్ని నిర్ణయాలు నాయకులూ తీసుకోవడం జరిగింది.

విజయవాడలో జరిగిన ఈ మూడురోజుల సమావేశాలకు ,అన్ని విధాలుగా సాయం అందించి ప్రోత్సహించిన గుంటూరు విజయవాడ ప్రాంతీయ నూత్ణీకరణ నాయక సేవకులైన సహోదరి మేరీ ప్రసాదమ్మ ,సహోదరులు జేసుదాసు,లూయీస్ బాబు ,సుధాకర్ ,జాన్ ,మహేష్ ,రాజేష్  మొదలైన వారందరికీ  యువత నాయకులు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.
విజయవాడ కాంటాక్టు పర్సన్ గా రాజేష్ నియమితులయ్యారు.కైరోస్ 2024 సదస్సు కొరకు ప్రార్ధించాలని  ఆంధ్రా &తెలంగాణ YU4C కోఆర్డినేటర్  శ్రీ బి. కళ్యాణ్ గారు కోరారు.

ఈ కైరోస్ 2024 సదస్సులలో పాల్గొనే వారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ జి .మేరీ ప్రకాషి .CNSC , 9440644431 మరియు కె . రాజే శ్ . 8179922751.

- బి. కళ్యాణ్ (ఆంధ్రా &తెలంగాణ YU4C కోఆర్డినేటర్, Ph:8885788994)

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer