కుటుంబ జీవిత నూత్మీకరణ సదస్సులు

కుటుంబ జీవిత నూత్మీకరణ సదస్సులు

విశాఖ అతిమేత్రాసనం, గాజువాక విచారణ , హోలీ క్రాస్ దేవాలయం లో "పాపులర్ మిషన్ ధ్యానం" విన్సెషియన్ గురువులు (పోటా బృందం) వారిచే కుటుంబ జీవిత నూత్మీకరణ సదస్సులు జరగనున్నట్లు విచారణ కర్తలు గురుశ్రీ ఆర్జి ప్రకాష్ గారు తెలిపారు.

ఈ సదస్సులు ఆగస్ట్ 4 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు జరగనున్నవి. దీనికి సంబంధించి ఒక ప్రకటనను విచారణ కర్తలు విడుదల చేసారు.

కార్యక్రమములో భాగంగా ఆగస్ట్ 4 వ తేదీ నుండి 6 వ తేదీ వరకుప్రతి రోజు సాయంత్రం 5.00 గంటలకు స్తుతి గీతములు, దివ్య బలిపూజ, వాక్య పరిచర్య నిర్వహించనున్నారు.

ఆగస్ట్ 5, 6 వ తేదీలలో ఉదయం 6.00 గంటల నుండి 9.00 గంటల వరకు గృహ సందర్శన కార్యక్రమం , 10.00 గంటల దివ్యసత్యసాద ఆరాధన నిర్వహించనున్నారు.

ఆగస్ట్ 7 వ తేదీ ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు దివ్యసత్ప్రసాద ఆరాధన,

సాయంత్రం 5.00 గంటలకు స్తుతి గీతములు, దివ్య బలిపూజ, వాక్య పరిచర్య జ్ఞానస్నాన సూత్రీకరణ, ఉపవాస స్వస్థతా ప్రార్ధన నిర్వహించనున్నారు.

ఆగస్ట్ 8 వ తేదీ 5:00 గంటలకు పాప పరిహార ప్రదక్షణ, స్తుతి గీతములు, దివ్యబలి పూజ, వివాహ వాగ్దాన నూత్మీకరణ, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.అనంతరం ప్రేమ విందును విచారణ కర్తలు గురుశ్రీ ఆర్జి ప్రకాష్ గారు ఏర్పాటు చేసారు.

కోపం, క్రోధం, ద్వేషం విడనాడి నిర్మల హృదయంతో తొలి క్రైస్తవ సంఘంవలె తయారుకావాలని, " ఒకరినొకరు మన్నిస్తూ సోదరులతో, దేవునితో ఏకమై దేవుని స్తుతించి వందనాలు అర్పించుదాం అని గురుశ్రీ ఆర్జి ప్రకాష్ గారు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ఈ కుటుంబ జీవిత నూత్మీకరణ సదస్సులుకు ప్రేమతో ఆహ్వానించువారు గాజువాక విచారణ కర్తలు గురుశ్రీ ఆర్జి ప్రకాష్ గారు మరియు విచారణ కన్యస్త్రీలు, సంఘ పెద్దలు, సంఘస్తులు, యువతి యువకులు, విశ్వాసులు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer