APFC రాయలసీమ ప్రాంతీయ తాత్కాలిక కమిటీ సమావేశం.

ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ అఫ్ చర్చిస్ (APFC) 23  జనవరి 2024న కర్నూలులోని జీవ సుధా పాస్టరల్ సెంటర్‌లో కడప మేత్రాసన పాలనాధికారి మహా పూజ్య గాలి బాలి గారు మరియు కర్నూలు మేత్రాసన పాలనాధికారి మొన్సిగ్నోర్ గురుశ్రీ చౌరప్ప గారి మార్గదర్శకత్వంలో రాయలసీమ ప్రాంతీయ తాత్కాలిక కమిటీ సమావేశం జరిగింది.

APFC యొక్క ప్రాంతీయ మరియు జిల్లా యూనిట్ల పనితీరు మరియు పద్ధతులపై విస్తృతమైన చర్చ అనంతరం, మెయిన్‌లైన్ మరియు ఇండిపెండెంట్ చర్చిల నుండి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.   

జిల్లా యూనిట్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని APFC వారు ఈ సమావేశం లో  నిర్ణయించారు.

తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య ( FTC ) కార్యదర్శి గురుశ్రీ కే అంతయ్య గారు సహాయం చేసిన నిర్వాహకులందరికీ మరియు చురుకుగా పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

ఈ సమావేశం క్రైస్తవ ఐక్యతా వార ప్రార్ధనతో ముగ్గిసింది.