హంగేరీ ప్రధాన మంత్రితో సమావేశమైన పోప్ లియో
సోమవారం అక్టోబర్ 27 న వాటికన్‌లో హంగేరీ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్ పోప్ లియోను కలిశారు.
ప్రధాన మంత్రి, వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో పాటు రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల కార్యదర్శి ఆర్చ్‌బిషప్ పాల్ రిచర్డ్ గల్లాఘర్‌తో కూడా సమావేశమయ్యారు అని హొయ్సీ ప్రెస్ ఆఫీస్ పేర్కొంది
సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో జరిగిన సమావేశంలో, రెండు పార్టీలు వాటికన్ మరియు హంగేరి మధ్య ద్వైపాక్షిక సంబంధాల" పట్ల సంతృప్తి వ్యక్తం చేశాయని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ తెలిపింది.
అంతేకాకుండా, ఈ స్నేహపూర్వక సమావేశంలో భాగంగా "సామాజిక అభివృద్ధి మరియు హంగేరియన్ సమాజ శ్రేయస్సును ప్రోత్సహించడంలో శ్రీసభ నిబద్ధతకు ప్రశంసలను అందుకున్నాయి.
కుటుంబం, విద్య మరియు యువకుల భవిష్యత్తుపై, అలాగే అత్యంత దుర్బలమైన క్రైస్తవ సమాజాలను రక్షించడం యొక్క ప్రాముఖ్యతను" ప్రస్తావించారు.
మధ్యప్రాచ్యంలోని పరిస్థితి మరియు యూరోపియన్ సమస్యలపై, ముఖ్యంగా ఉక్రెయిన్‌లో సంఘర్షణపై కూడా దృష్టి సారించబడింది.
దివంగత పోప్ ఫ్రాన్సిస్, 2023 ఏప్రిల్ 28-30 వరకు యూరోపియన్ దేశమైన హంగేరీకి తన 41వ అపోస్టోలిక్ పర్యటనను చేశారు.
52వ అంతర్జాతీయ యూకారిస్ట్ కాంగ్రెస్ ముగింపు ప్రార్థనకు అధ్యక్షత వహించడానికి పొప్ ఫ్రాన్సిస్ 2021 సెప్టెంబర్‌లో Budapestను కూడా సందర్శించారు.