"స్వచ్ఛంద సేవకుల జూబ్లీ" ని కొనియాడిన వాటికన్

మార్చి 9 ఆదివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో దివ్యబలిపూజలో  "స్వచ్ఛంద సేవకుల జూబ్లీ" కి కార్డినల్ Michael Czerny అధ్యక్షత వహించారు

వేలాది మంది స్వచ్ఛంద సేవకుల ఫ్లోరోసెంట్ యూనిఫాంలు ప్రత్యేకంగా నిలిచాయి. తపస్సు కాల మొదటి ఆదివారం దివ్యబలి పూజలో ఊదా రంగు ప్రార్థనా వస్త్రాలతో, ముప్పై వేల మంది స్వచ్ఛంద సేవకుల ఫ్లోరోసెంట్ FLOURESCENT UNIFORM లు ప్రత్యేకంగా నిలిచాయి

సమగ్ర మానవ అభివృద్ధిని ప్రోత్సహించే డికాస్టరీ ప్రిఫెక్ట్ కార్డినల్ Michael Czerny ,వంద మందికి పైగా కార్డినలు, పీఠాదిపతులు మరియు గురువులు తపస్సు కాల మొదటి ఆదివారం సమిష్టి దివ్యబలి పూజను సమర్పించారు.

పోప్ ఫ్రాన్సిస్ ఫిబ్రవరి 14 నుండి ఆసుపత్రిలో ఉన్నందున కార్డినల్ జెర్నీకి అధ్యక్షత వహించడానికి అప్పగించారు.

సెయింట్ పీటర్స్ బసిలికా లో పోప్ ఆధ్యాత్మిక ఉనికిని central loggiaపై ప్రదర్శించబడిన పాపల్ చిహ్నంతో ఉన్న బ్యానర్‌లో ప్రతీకగా చూపించారు.

పోప్ ఫ్రాన్సిస్ తయారు చేసి ప్రసంగం కార్డినల్ జెర్నీ చదివి వినిపించారు.

పోప్ తపస్సు కాల ప్రయాణం ప్రారంభంపై దృష్టి సారించారు, ప్రపంచవ్యాప్తంగా జూబిలీ తీర్థయాత్ర కొరకు రోమ్‌ను సందర్శించే వారికి స్వచ్ఛంద సేవకుల చేస్తున్న సేవ మరియు వారి నిబద్ధతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు