స్పెయిన్ ప్రధాన మంత్రితో ఫోన్లో సంభాషించిన పోప్

జూన్ 11 మధ్యాహ్నం స్పెయిన్ ప్రధాన మంత్రి Mr. Pedro Sánchez Pérez-Castejónతో పోప్ లియో ఫోన్లో మాట్లాడారు.
పోప్ ప్రతిష్ఠోత్సవ దివ్యబలిపూజలో పాల్గొనడానికి స్పెయిన్ రాజు ఫెలిపే మరియు రాణి Letizia రోమ్కు వచ్చినందుకు పోప్ తన కృతజ్ఞతను వ్యక్తం చేసినట్లు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ తెలిపింది.
వలస సంక్షోభం, కొనసాగుతున్న సంఘర్షణలను పరిష్కరించడానికి సంభాషణ అవసరం మరియు మానవ గౌరవాన్ని కాపాడుకోవడం వంటి ముఖ్యమైన అంశాలను కూడా ఇద్దరూ చర్చించారు.
జూన్ మాసంలో స్పెయిన్‌లోని సెవిల్లెలో జరగనున్న అభివృద్ధి కొరకు ఆర్థిక సహాయంపై నాల్గవ అంతర్జాతీయ సమావేశం గురించి వ్యాఖ్యానించిన తర్వాత, ప్రధాన మంత్రి పోప్ లియోను స్పెయిన్‌ను సందర్శించమని ఆహ్వానించారు
Note: This is purely Telugu Content.