సెయింట్ పాల్ పవిత్ర ద్వారాన్ని తెరిచినా కార్డినల్ జేమ్స్ హార్వే
క్రీస్తు జయంతి తర్వాత రెండవ ఆదివారం, జనవరి 5,2025 న ముగ్గురు రాజుల పండుగ రోజున జూబ్లీ కీర్తన ప్రతిధ్వనిస్తుండగా రోమ్‌లోని సెయింట్ పాల్ పాపల్ బసిలికా ఆర్చ్‌ప్రిస్ట్ కార్డినల్ మహా పూజ్య జేమ్స్ హార్వే పవిత్ర తలుపును తెరిచారు .
"విశ్వాసం యొక్క అడుగుజాడల్లో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చేపట్టడానికి" విశ్వ శ్రీసభ ప్రతి యాత్రికుడిని ఆహ్వానిస్తుందని ఆయన తెలిపారు.
పాపల్ బసిలికా ఆర్చ్‌ప్రిస్ట్ కార్డినల్ మహా పూజ్య జేమ్స్ హార్వే తో, డికాస్టరీ ఫర్ ఎవాంజలైజేషన్ ప్రో-ప్రిఫెక్ట్ మహా పూజ్య రినో ఫిసిచెల్లా(Rino Fisichella) మరియు జూబ్లీ నిర్వాహకులు బసిలికా లోనికి వెళ్లారు
2,800 మందికి పైగా విశ్వాసులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
"రెండు వేల సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో ప్రయాణించి, యేసు ప్రభుని పునరుత్థానాన్ని ప్రకటిస్తూ, ఈ సమాజంలో భాగమైన అనుభూతి పొందాం" అలాగే 2025 జూబ్లీ, ప్రతి పవిత్ర సంవత్సరం మాదిరిగానే, యాత్రికులుగా మారమని మనల్ని అడుగుతుంది అని కార్డినల్ హార్వే ముగించారు