సిగ్నిస్ మధ్యప్రదేశ్ ప్రాంతీయ సదస్సు

సమాచార నిపుణులు, చర్చి నాయకులు మరియు ప్రసార మాధ్యమాల అభ్యాసకులు జబల్‌పూర్‌లోని సెయింట్ నార్బర్ట్స్ అబ్బేలో నవంబర్ 14 నుండి 16 వరకు సిగ్నిస్ మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్ ప్రాంతీయ సదస్సుకు సమావేశమయ్యారు.

"పరిపూర్ణ మానవ అనుసంధాన సమాచార దిశలో కృత్రిమ మేధస్సు మరియు హృదయ జ్ఞానం" 
అనే అంశంపై ఈ సదస్సు దృష్టి సారించారు 

CBCI సమాచార విభాగ కార్యదర్శి గురుశ్రీ బిజు ఆలప్పట్టు, సెయింట్ నార్బర్ట్స్ అబ్బే ప్రియర్ గురుశ్రీ అరులానంద, SIGNIS MP&CG అధ్యక్షుడు గురుశ్రీ రాకీ షా, SIGNIS ఇండియా వైస్-ప్రెసిడెంట్ శ్రీ సుమిత్ ధనరాజ్ మరియు జీ టెలివిజన్‌లో డిజిటల్ మార్కెటింగ్ మరియు సోషల్ మీడియా హెడ్ శ్రీ బెర్విన్ రాజా తదితర ప్రముఖులు సదస్సుకు హాజరయ్యారు 


బాధ్యతాయుతమైన సమాచార వినియోగంపై పోప్ ఫ్రాన్సిస్ సందేశానికి అనుగుణంగా ఆధునిక సమరచ సాధనాలను ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని గురుశ్రీ ఆలప్పట్టు ముఖ్య ప్రసంగంలో తెలిపారు 

కాపీరైట్ సమస్యలు మరియు కృత్రిమ మేధస్సు ఆధారిత స్కామ్‌ల వంటి సవాళ్లను పరిష్కరిస్తూ, కమ్యూనికేషన్‌ను మెరుగుపరిచేందుకు ChatGPT వంటి AI సాధనాలను ప్రదర్శిస్తూ వివరించారు మిస్టర్ బెర్విన్ రాజా.

గురుశ్రీ ఆంథోనీ స్వామి SVD దృశ్యపరంగా ఆకర్షణీయమైన కంటెంట్‌ను రూపొందించడానికి మైక్రోసాఫ్ట్ డిజైనర్ మరియు కాన్వాను ఉపయోగించడంపై సెషన్‌ను నిర్వహించారు.

SIGNIS సభ్యులు  ప్రపంచ సమాచార దినోత్సవం మరియు జూబ్లీ సంవత్సరానికి సంబంధించిన లిటర్జికల్ ఆల్బమ్‌తో సహా రాబోయే కార్యక్రమాలను ప్రణాళిక రోపొందించడంతో ఈ సమావేశం ముగిసింది.
.