సంఘర్షణ స్థలాలలో సేవ చేస్తున్న గురువులు,మఠవాసులకు ధన్యవాదాలు తెలిపిన పోప్ ఫ్రాన్సిస్

ఫిబ్రవరి 5,బుధవారం ఉదయం సామాన్య ప్రజల సమావేశంలో ముగింపులో ఉక్రెయిన్, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాతో సహా యుద్ధంతో బాధపడుతున్న వివిధ దేశాలలో శాంతి ప్రార్ధించమని పొప్ ఫ్రాన్సిస్ కోరారు.

యుద్ధంతో నలిగిపోయిన దేశాలలో బాధపడుతున్న వారందరి కోసం ప్రార్థిస్తూ, పేద మరియు సంఘర్షణతో బాధపడుతున్న దేశాలలో సేవ చేస్తున్న గురువులు మరియు మఠవాసులు ప్రత్యేకంగా పోప్ ఫ్రాన్సిస్ గుర్తుచేసుకున్నారు.

"పాలస్తీనాలోని స్థానభ్రంశం చెందిన ప్రజలందరినీ మనం గుర్తుంచుకుందాం మరియు వారి కోసం ప్రార్థిద్దాం"

అదేవిధంగా, పొప్ ఫ్రాన్సిస్ పోలిష్ మాట్లాడే విశ్వాసులకు తన వ్యాఖ్యల సమయంలో, యుద్ధంలో దెబ్బతిన్న,ముఖ్యంగా ఉక్రెయిన్, మధ్యప్రాచ్యం మరియు కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్‌లో ధైర్యంగా సేవ చేస్తున్న పోలిష్  గురువులు మరియు మఠవాసులకు తన కృతజ్ఞతలు తెలిపారు.

చివరగా యువకులను, రోగులను, వృద్ధులను మరియు నూతన వధూవరులను నిరంతరం ప్రార్ధించమని, నిరాశ పడవద్దని, పేద ప్రజలకు సహాయం చేయడానికి తమను తాము అంకితం చేసుకోవాలని  పొప్ ఫ్రాన్సిస్ ప్రోత్సహించారు.