శాశ్వత మాటపట్టును తీసుకున్న ఆరుగురు కార్మెలైట్ బ్రదర్స్

మే 22న మంగుళూరులోని బికర్నకట్టేలోని బాలయేసు పుణ్యక్షేత్రంలో కర్ణాటక-గోవా ప్రావిన్స్‌కు చెందిన ఆరుగురు కార్మెలైట్ బ్రదర్ లు తమ శాశ్వత మాటపట్టు తీసుకున్నారు.

గురుశ్రీ సిల్వెస్టర్ డిసౌజా, OCD, ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు ఈ బ్రదర్ల మాటపట్టును స్వీకరించారు.

బ్రదర్ ప్రణయ్ పెరీరా (సెయింట్ సెబాస్టియన్ చర్చి, పెర్మన్నూర్, మంగళూరు మేత్రాసనం), 
బ్రదర్ ఆల్విన్ డిసౌజా (సెయింట్ థామస్ ది అపోస్టిల్ చర్చి, మంగళూరు మేత్రాసనంలోని నిర్కాన్),
బ్రదర్ ఎల్స్టన్ మోంటెరో (హోలీ క్రాస్ చర్చి, మంగళూరు మేత్రాసనంలోని ఎలియార్‌పదవ్), బ్రదర్  స్టిన్ జార్జ్ (సెయింట్ ఆంథోనీ చర్చి, మైసూర్ మేత్రాసనంలోని సుంటికొప్ప),
బ్రదర్  లాయ్ క్రాస్టా (ఇన్‌ఫాంట్ మేరీ చర్చి, మంగళూరు మేత్రాసనంలోని బజ్జోడి) మరియు బ్రదర్  హిల్లరీ రోడ్రిగ్స్ (అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ సకర్ చర్చ్, కార్వార్ మేత్రాసనంలోని హోసాద్-హోనావర్)కు చెందిన వారు.

గురుశ్రీ డిసౌజా గారు దివ్యబలిని సమర్పించారు,బికర్నకట్టెలోని సెయింట్ జోసెఫ్ మొనాస్టరీ సుపీరియర్ గురుశ్రీ మెల్విన్ డి'కున్హా OCD, గురుశ్రీ దీప్ ఫెర్నాండెజ్ OCD, ఢిల్లీ అగ్రపీఠానికి  చెందిన గురుశ్రీ విన్సెంట్ క్రాస్టా, కార్వార్ మేత్రాసనానికి చెందిన గురుశ్రీ  ఆంథోనీ రోడ్రిగ్స్, ప్రొవిన్షియల్ కౌన్సిలర్లు మరియు ఇతర గురువులు కూడా పాల్గొన్నారు.
 

Tags