శాంతి మరియు ఐక్యతకు పిలుపునిచ్చిన కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియాస్

ముంబైలోని హోలీ నేమ్ హై స్కూల్ ఆడిటోరియంలో డిసెంబర్ 14న ముంబై అగ్రపీఠం, సర్వమత సమాలోచన విభాగం వారు క్రీస్తు జయంతి వేడుకలను నిర్వహించారు 

కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియాస్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఐక్యత, అవగాహన మరియు క్రిస్మస్ నిజమైన స్ఫూర్తిని పెంపొందించడానికి వివిధ విశ్వాసాల ప్రతినిధులు, దౌత్యవేత్తలు మరియు సంఘం సభ్యులను ఒకచోట చేర్చారు.

హోలీ నేమ్ కేథడ్రల్ గాయక బృందం సాంప్రదాయ క్రిస్మస్ పాటలను పాడారు, ఆ తర్వాత సెయింట్ జాన్ ది ఎవాంజెలిస్ట్ స్కూల్  విద్యార్థులు ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు.

"మన కుటుంబాల్లో దేవుణ్ణి స్వాగతించడం" అనే అంశంపై దృష్టి సారించి, జీవితంలోని సవాళ్లను అధిగమించడంలో విశ్వాసం కేంద్రీకృతతను హైలైట్ చేస్తూ  క్రీస్తు జనన ఔచిత్యాన్ని విద్యార్థులు తెలియజేశారు.

కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియాస్ హృదయపూర్వక క్రిస్మస్ సందేశాన్ని అందించారు,  వినయం, ప్రేమ మరియు పరివర్తన కొరకు పిలుపునిచ్చారు

కుటుంబాలు ధర్మాన్ని, సామరస్యాన్ని అలవర్చుకోవాలని ఆయన కోరారు,. 

పోప్ ఫ్రాన్సిస్ పిలుపు మేరకు జూబ్లీ 2025లో ప్రజల సంఘీభావం కొర్రుతూ, కార్డినల్ గారు హాజరైన వారిని "వారి దైనందిన జీవితంలో క్రీస్తు శాంతికి సాధనాలుగా మారాలని" ఆహ్వానించారు.

Tags