వైద్యులు కీలక ప్రకటన!

'ఇకపై చికిత్స అవసరం లేదు' - వైద్యులు కీలక ప్రకటన

'ఇకపై చికిత్స అవసరం లేదు' - వైద్యులు కీలక ప్రకటన

పరిశుద్ధ లియో పాపు గారి ఆరోగ్యంపై వైద్యులు కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 13న ఆయన కుడి ఊపిరితిత్తుల దిగువ భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించగా, అందులోని కణితి లంగ్ అడెనోకార్సినోమా (Lung Adenocarcinoma) అనే క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. అయితే, ఈ వ్యాధి ఒకే ప్రాంతానికి పరిమితమైందని, ఇతర భాగాలకు వ్యాపించలేదని అక్టోబర్ 21న వైద్యులు వెల్లడించారు. 

పరిశుద్ధ లియో పాపు గారి  వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ లుయిగి కార్బోన్, శస్త్రచికిత్స నిపుణుడు ప్రొఫెసర్ స్టెఫానో మార్గరిటోరా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, శస్త్రచికిత్సలో తొలగించిన కణజాలంపై నిర్వహించిన హిస్టోపాథలాజికల్, మాలిక్యులర్  పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణ అయింది. అనంతరం నిర్వహించిన క్యాన్సర్ సంబంధిత వైద్య మూల్యాంకనంలో ఇకపై అదనపు చికిత్స అవసరం లేదని స్పష్టమైంది.

ఊపిరితిత్తుల అడెనోకార్సినోమా అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో ఒక సాధారణ రకం. వ్యాధి ఒకే ప్రాంతానికి పరిమితమై ఉండటం, శస్త్రచికిత్స విజయవంతం కావడం పోప్ ఆరోగ్యంపై ఆశాజనక పరిణామాలుగా భావిస్తున్నారు.

వైద్యుల తాజా ప్రకటనతో పరిశుద్ధ లియో పాపు గారి ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న కతోలిక   విశ్వాసులకు ఊరట లభించింది.

 

Article and Designed By  M Kranthi Swaroop

Telugu Survey Popup Image