వాషింగ్టన్ నూతన అగ్రపీఠాధిపతిగా కార్డినల్ రాబర్ట్ వాల్టర్ నియామకం

మార్చి 2015 నుండి శాన్ డియాగో మేత్రాసన పీఠాధిపతిగా వ్యవహరిస్తున్న కార్డినల్ రాబర్ట్ వాల్టర్ ని వాషింగ్టన్ నూతన అగ్రపీఠాధిపతిగా పోప్ ఫ్రాన్సిస్ నియమించారు.

వాషింగ్టన్ మెట్రోపాలిటన్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ విల్టన్ డేనియల్ గ్రెగోరీ రాజీనామాను ఆమోదించిన తర్వాత పొప్ ఫ్రాన్సిస్ ఈ నియామకం చేయడం జరిగింది

కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 5 ఫిబ్రవరి 1954న జన్మించారు 

సెయింట్ జోసెఫ్ మైనర్ సెమినరీకి హాజరయ్యాడు,కేంబ్రిడ్జ్‌ హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచలర్ డిగ్రీ  మరియు కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి హిస్టరీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు

రోమ్‌లోని పోంటిఫికల్ గ్రెగోరియన్ విశ్వవిద్యాలయం నుండి నైతిక వేదాంతశాస్త్రంలో మరియు స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు 

శాన్ ఫ్రాన్సిస్కో మెట్రోపాలిటన్ అగ్రపీఠానికి 12 ఏప్రిల్ 1980న గురువుగా అభిషేకింపబడ్డారు.

6 జూలై 2010న Gemelle di Bizacena పీఠాధిపతిగా మరియు శాన్ ఫ్రాన్సిస్కో సహాయక పీఠాధిపతిగా నియమితులయ్యారు,

7 సెప్టెంబర్ 2010న పీఠాధిపతిగా అభిషేకింపబ్బడారు .

శాన్ డియాగో మేత్రాసనానికి సేవ చేస్తున్న సమయంలో, 27 ఆగస్టు 2022 కార్డినల్ గా పోప్ ఫ్రాన్సిస్ నియమించారు.
 

Tags