వాటికన్ లో బాలల హక్కులపై ప్రపంచ సదస్సు

28 జనవరి మంగళవారం, హోలీ సీ ప్రెస్ ఆఫీస్ బాలల హక్కులపై మొట్టమొదటి ప్రపంచ సమావేశం షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఫిబ్రవరి 3న వాటికన్ లో, జోర్డాన్ రాణి, అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ అల్ గోర్ లతో సహా బాలల హక్కుల కమిటీలతో సమావేశం నిర్వహిస్తుంది.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, Sant’Egidio కమ్యూనిటీ అధ్యక్షుడు Marco Impagliazzo ఈ సమావేశాన్ని "నిరీక్షణకు ఒక వేదిక " అని తెలిపారు 

"యుద్ధం, హింస, లైంగిక మరియు శ్రమ దోపిడీ కారణంగా చాలా మంది పిల్లలు మరణిస్తున్నారు"  ఇలా బాధపడుతున్న పిల్లలలో చిరునవ్వు తీసుకురావాలని" పొప్ కోరుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు

ప్రతిరోజూ లక్షలాది మంది పిల్లలు ఎదుర్కొంటున్న మరియు పెరుగుతున్న సవాళ్లకు ప్రతిస్పందనగా ఈ ప్రపంచ బాలల హక్కుల సమావేశం నిర్వహిస్తున్నారు అని ఆయన అన్నారు 

"ప్రపంచంలో వాతావరణ మార్పు, అసమానత మరియు సంఘర్షణ పిల్లల జీవితాలను దెబ్బతీస్తున్నాయి మరియు వారి భవిష్యత్తును దెబ్బతీస్తుందని" ఐక్యరాజ్యసమితి బాలల నిధి నుండి వచ్చిన ఒక అధ్యయనం నివేదించింది.