వాటికన్ మొదటి మహిళా ప్రిఫెక్ట్‌గా సిస్టర్ సిమోనా బ్రాంబిల్లా నియామకం
వాటికన్ లోని పొప్ గారి పరిపాలన యంత్రాంగంలోని సమర్పణ జీవితం, అపోస్తలిక జీవన సంస్థల విభాగ ప్రిఫెక్ట్ గా,కన్సోలాటా మఠ సంస్థకు చెందిన సిస్టర్ సిమోనా బ్రాంబిల్లా ను జనవరి 7 న పోప్ ఫ్రాన్సిస్ నియమించారు
తను అక్టోబర్ 7, 2023 నుండి అదే డికాస్టరీకి కార్యదర్శిగా పనిచేశారు మరియు హోలీ సీ డికాస్టరీకి ప్రిఫెక్ట్‌గా నియమితులైన మొదటి మహిళ సిస్టర్ సిమోనా బ్రాంబిల్లా.
2019లో ఇదే శాఖలో ఆమె సభ్యురాలుగా ఉంటూ, తన అమూల్యమైన సేవలందించారు.
సిస్టర్ సిమోనా బ్రాంబిల్లా గారు వేదాంత ఆధ్యాపకురాలిగా, కన్సోలాటా మఠ సంస్థకు జనరల్ కౌన్సిలర్ గా, సుపీరియర్ జనరల్గా తన అమూల్యమైన సేవలు శ్రీసభకు అందించారు.
ముఖ్యంగా యువత ఆధ్యాత్మిక ఎదుగుదలకై ఆమె ఎంతగానో శ్రమించారు.
ఆమె సేవలను పరిగణలోనికి తీసుకొని పోప్ ఫ్రాన్సిస్ గారు ఇంతటి ప్రతిష్టాత్మకమైన హోదాకు ఆమెను ఎన్నుకున్నారు.
పోప్ ఫ్రాన్సిస్ గారు శ్రీసభ సేవా పరిచర్యలలో పురుషులతో పాటు స్త్రీలు కూడా గణనీయమైన పాత్రను పోషించాలని తలంచి, గతంలోను వారికి పలు కీలక పదవులు,నిర్ణయాధికార బాధ్యతలు కట్టబెట్టిన విషయం మనకు తెలిసిందే.
డిసెంబర్ 13, 2024న, సిస్టర్ సిమోనా బ్రాంబిల్లా మరియు వరల్డ్ యూనియన్ ఆఫ్ కాథలిక్ ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ (WUCWO) మాజీ అధ్యక్షురాలు మరియా లియా జెర్వినోలను జనరల్ సెక్రటేరియట్ 16వ సాధారణ కౌన్సిల్ సభ్యులుగా పొప్ ఫ్రాన్సిస్ నియమించారు.