వాటికన్ పెన్షన్ ఫండ్ సమస్యలను పరిష్కరించడానికి కార్డినల్ ఫారెల్ నియామకం
వాటికన్ పెన్షన్ ఫండ్ అడ్మినిస్ట్రేటర్‌గా కార్డినల్ కెవిన్ ఫారెల్ గారిని 15 ,నవంబర్ 2024 పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు నియమించారు.
హోలీ సీ ప్రెస్ ఆఫీస్ వారు విడుదల చేసిన కాలేజ్ ఆఫ్ కార్డినల్స్‌కు రాసిన లేఖలో ఈ నియామకాన్ని ప్రకటించడం జరిగింది
పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ పెన్షన్ సిస్టమ్ సవాళ్లను పరిష్కరించడానికి మరియు హోలీ సీ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి "కొత్త మరియు అనివార్యమైన మార్పు " కోసం పిలుపునిచ్చినందున తనతో పాటు అందరిని మద్దతు ఇవ్వమని తన సహకారులను కోరారు .
పోప్ ఫ్రాన్సిస్ రోమన్ క్యూరియా మరియు హోలీ సీతో అనుసంధానించబడిన సంస్థల మధ్య ఐక్యత మరియు సహకారం కోసం పిలుపునిచ్చారు, భాగస్వామ్య దృష్టితో అవసరమైన సంస్కరణలను చేరుకోవాలని అందరినీ కోరారు.
"అత్యవసరమైన నిర్మాణాత్మక చర్యలు అవసరమని ఇప్పుడు మనందరికీ తెలుసు, ఇది ఇకపై వాయిదా పడదని, పెన్షన్ ఫండ్ సుస్థిరతను సాధించడానికి, రాబోయే తరాలకు న్యాయం, సమానత్వం మార్గదర్శక సూత్రాలుగా ఉండాలని ఆయన అన్నారు.
ఈ సవాళ్ళ పరివర్తన సమయంలో ప్రార్థన మరియు మద్దతు కొరకు ఒక అభ్యర్ధనతో పొప్ గారు తన లేఖను ముగించారు.
"మీ అందరికీ, ఈ కొత్త మరియు అనివార్యమైన మార్పు మార్గాన్ని సులభతరం చేయడంలో నేను ప్రత్యేక సహకారాన్ని అభ్యర్థిస్తున్నాను. అందరి మద్దతు మరియు సహాయాన్ని విశ్వసిస్తూ, ఈ క్షణాన్ని మీ ప్రార్ధనలతో కలిసి ఉండవలసిందిగా కోరుతున్నాను" అని రాశారు.
మీ అంద రికీ ఈ నూత న మ రియు అనివార్య మైన ప రివ ర్త న కు మార్గాన్ని సుగ మం చేయ డం కోసం ప్ర త్యేక స హ కారాన్ని కోరుతున్నాను. ప్రతి ఒక్కరి మద్దతు, సహాయంపై నమ్మకముంచండి, ఈ క్షణం మీ ప్రార్థనలతో మీ వెంట రావాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను” అని ట్వీట్ చేశారు.