మెలిస్సా తుఫాన్ బాధితుల కొరకు ప్రార్థించిన పోప్ లియో.
బుధవారం అక్టోబర్ 29 సామాన్య ప్రేక్షకుల సమావేశం ముగింపులో కరేబియన్ లో
మెలిస్సా తుఫాను ప్రభావితుల అత్యవసర పరిస్థితిని పోప్ లియో ప్రస్తావించారు.
తుఫాను తీవ్రతను మరియు అనేక మంది జీవితాలపై దాని ప్రభావాన్ని, నష్టం మరియు ప్రస్తుతం కొనసాగుతున్న తరలింపుల గురించి హెచ్చరించారు.
ఇటీవలి రోజుల్లో మెలిస్సా తుఫాను జమైకాను అతలాకుతలం చేసింది,ఇది ప్రస్తుతం క్యూబాను ముంచెత్తుతోంది.
వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు, ఇళ్ళు, మౌలిక సదుపాయాలు మరియు అనేక ఆసుపత్రులు దెబ్బతిన్నాయి.
ప్రాణాలను కోల్పోయిన వారి కొరకు మరియు తుఫాను భాదితుల కోసం నా సాన్నిహిత్యని, ప్రార్థనల హామీ ఇస్తున్నాను అని పొప్ అన్నారు