మహిళా నాయకత్వంపై జాతీయ శిక్షణా కార్యక్రమం నిర్వహించిన CCBI

గోవాలోని CCBI సెంటర్, శాంతి సదన్ లో డిసెంబర్ 6 నుండి 8 వరకు CCBI మహిళా విభాగం వారు  'నేషనల్ రిసోర్స్ టీమ్ శిక్షణా' కార్యక్రమాన్ని నిర్వహించారు.

భారతదేశం అంతటి మేత్రాసనాలు మరియు ప్రాంతీయ నెట్‌వర్క్‌ల నుండి 23 మంది మహిళా నాయకులను ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు 

2023–2033 కొరకు ఈ మహిళా విభాగం పాస్టోరల్ ప్లాన్‌కు అనుగుణంగా ఆధ్యాత్మిక, సామాజిక మరియు మతసంబంధమైన బాధ్యతలను పరిష్కరించడానికి పాల్గొనేవారిని నైపుణ్యాలు మరియు వ్యూహాలతో సన్నద్ధం చేయడం ఈ శిక్షణ లక్ష్యం.

ఈ  శిక్షణా కార్యక్రమం, గురుశ్రీ రెజినాల్డ్ పింటో గారి మార్గదర్శకత్వంలో నిర్వహించబడింది. 

కుటుంబాలలో, విచారణలలో, మేత్రాసనాలలో మరియు విస్తృత సమాజంలో మహిళా నాయకులకు సాధికారికంగా ఒక ముఖ్యమైన అడుగుగా ఈ శిక్షణ నిలిచింది.

నాయకత్వ అభివృద్ధికి ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం కార్యక్రమం యొక్క ఫలితాలు,

ఇప్పటికే ఉన్న కార్యనిర్వాహక బృందాలకు మించి ఒక్కో మేత్రాసనం నుండి 10 మంది నాయకులను ఏర్పాటు చేయడం.

వారి విచారణలలో రిసోర్స్ పర్సన్‌లుగా పనిచేయడానికి డీనరీ స్థాయిలో 5 నుండి 10 మంది నాయకులకు శిక్షణ ఇస్తారు

మూడు రోజుల కార్యక్రమంలో  శ్రీసభ మరియు సమాజంలో మహిళల పాత్ర గురించి అవగాహన పెంచడం, వారి ప్రాముఖ్యతను తెలియచేయడం జరిగింది .

వారి సంబంధిత ప్రాంతాలలో పరివర్తన కార్యక్రమాలకు నాయకత్వం వహించే రిసోర్స్ పర్సన్ల బలమైన నెట్‌వర్క్‌ను సృష్టించడంపై దృష్టి సారించింది.

మహిళల హక్కులు మరియు వారు చేస్తున్న సేవ గుర్తించి, గౌరవించబడే సమసమాజాన్ని నిర్మించాలనే CCBI మహిళా విభాగ నిబద్ధతను ఈ కార్యక్రమం తెలియపరుస్తుంది.

Tags