భారత దేశంలోని వివిధ మేత్రాసనాలకి పీఠకాపరులను నియమించిన పొప్ ఫ్రాన్సిస్

ప్రస్తుతం వరంగల్ పీఠ కాపరిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహా ఘన.ఉడుమల బాల గారిని విశాఖ అగ్రపీఠానికి పీఠ కాపరిగా నియమిస్తూ ఫిబ్రవరి 8 పోప్ ఫ్రాన్సిస్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉడుమల బాల గారు ఫిబ్రవరి 20, 1979లో గురువుగా అభిషేకించబడ్డారు.

1994 నుండి 2002 వరకు హైదరాబాద్ అగ్రపీఠం పీఠం, రామంతపూర్ లోని పునీత యోహాను ప్రాంతీయ గురు విద్యాలయ వేదాంతాచార్యునిగా,రెక్టార్‌గా 2006 నుండి 2013 వరకు అఖిలభారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య ఉప ప్రధాన కార్యదర్శిగా,

2015 నుండి 2023 వరకు తెలుగు కతోలిక పీఠాధిపతుల సమాఖ్య దైవ పిలుపులు, గురువులు, గృహస్థ క్రైస్తవుల సేవా విభాగానికి అధ్యక్షునిగా, 

2022 నుండి 2024 వరకు ఖమ్మం పీఠానికి అపోస్తొలిక పాలనాధికారిగా తన విశిష్ట సేవలందించారు.

కలకత్తాలోని బారక్‌పూర్‌లోని మార్నింగ్ స్టార్ రీజినల్ కాలేజీలో బైబిల్ థియాలజీ ప్రొఫెసర్‌గా ఉన్న గురుశ్రీ ఫాబియన్ టోప్పోను జల్ పైగురి మేత్రాసనానికి నూతన పీఠాధిపతిగా నియమించారు.

నెయ్యట్టింకర కోడ్జూటర్ పీఠాధిపతిగా గురుశ్రీ డి సెల్వరాజన్ నియమితులయ్యారు 

2011 నుండి నెయ్యట్టింకర జ్యుడిషియల్ వికార్‌గా, 2019 నుండి తిరుపురంలోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ విచారణ గురువుగా సేవలు అందిస్తున్నారు.

షిల్లాంగ్ సహాయక అగ్రపీఠాధిపతిగా కు గురుశ్రీ  బెర్నార్డ్ లాలూ గారు నియమితులయ్యారు  నియమించారు.

Tags