భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య కార్యాలయ అధికారుల ఎన్నిక.

ఫిబ్రవరి 2, 2025 భువనేశ్వర్‌లోని XIM విశ్వవిద్యాలయంలో CCBI 36వ సర్వసభ్య సమావేశంలో కార్యాలయ అధికారుల ఎన్నిక జరిగింది.

భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CCBI) అధ్యక్షుడిగా కార్డినల్ ఫిలిప్ నేరి ఫెర్రావో తిరిగి ఎన్నికకాగా, బెంగళూరు అగ్రపీఠాధిపతులు మహా పూజ్య పీటర్ మచాడో ఉపాధ్యక్షుడిగా మరియు రాంచీ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య విన్సెంట్ ఐండ్ సెక్రటరీ జనరల్‌గా ఎన్నికయ్యారు.

2019లో చెన్నైలో జరిగిన 31వ CCBI సర్వసభ్య సమావేశంలో కార్డినల్ ఫిలిప్ నేరి ఫెర్రావో (72) మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

బెంగళూరులో జరిగిన 34వ ప్లీనరీ అసెంబ్లీలో 2023లో ఆయన రెండవసారి తిరిగి ఎన్నికయ్యారు.

ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ (FABC) అధ్యక్షుడు జనవరి 2025లో ఈ పదవిని చేపట్టారు.

డికాస్టరీ ఫర్ ఎవాంజెలైజేషన్ మరియు సినడ్ ఆఫ్ బిషప్‌ సెక్రటేరియట్ సభ్యుడు కూడా.

బెంగళూరు అగ్రపీఠాధిపతులు మహా పూజ్య పీటర్ మచాడో గారు ప్రస్తుతం కర్ణాటక ప్రాంతీయ పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడిగా మరియు CCBI కమిషన్ ఫర్ లైటీ ఛైర్మన్‌గా తన సేవ అందిస్తున్నారు 

మహా పూజ్య విన్సెంట్ ఐండ్ CCBI కమిషన్ ఫర్ థియాలజీ అండ్ డాక్ట్రిన్ కు ఛైర్మన్ గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 30, 2023న, ఆయన రాంచీ అగ్రపీఠాధిపతులుగా నియమితులయ్యారు.