భారతదేశంలో క్రైస్తవులపై దాడులు పెరిగాయి - యునైటెడ్ క్రిస్టియన్ ఫోరమ్

భారతదేశంలో క్రైస్తవులపై దాడులు పెరిగాయి -  యునైటెడ్ క్రిస్టియన్ ఫోరమ్

భారతదేశంలోని క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్న హింసాత్మక సంఘటనల సగటు సంఖ్య క్రిస్మస్ సెలవులకు ముందు రోజుకు రెండు నుండి రోజుకు మూడుకు పెరిగింది.
యునైటెడ్ క్రిస్టియన్ ఫోరమ్ (UCF)నివేదిక ప్రకారం భారతదేశంలో 2023 చివరి ఏడు రోజుల్లో క్రైస్తవులపై 23 హింసాత్మక సంఘటనల జరిగినట్లు తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు పంజాబ్ రాష్ట్రాల్లో, అలాగే ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్‌లలో ఒక్కొక్కటి సంఘటనలు జరిగాయి.  

మొత్తంగా, 2023లో భారతదేశంలో క్రైస్తవులపై 720 హింసాత్మక సంఘటనలు జరిగినట్లు  UCF జాతీయ కన్వీనర్ A. C. మైఖేల్ గారు తెలిపారు. డిసెంబర్ 25, 2023న లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఆరాధనలు మరియు క్రిస్మస్ జరుపుకునే సందర్భములో  దేవలయ నాయకులు 7గురుని ,  ఐదుగురు పాస్టర్‌లును,  రాకేష్, అరుణ్, రామ్, రాంకిషోర్ మరియు అశోక్‌లను అధికారులు  అరెస్టు చేశారు.

అదే రోజు, ఉత్తరప్రదేశ్ పోలీసులు వివిధ రాష్ట్రాల్లో మత మార్పిడులను నేరంగా పరిగణించే చట్టం (ఫోరా) (The Freedom of Religion Act (FORA)) కింద మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో చనిపోయిన  క్రైస్తవులను ఖననం చేసేందుకు అధికారులు నిరాకరించారు.

 

కర్నాటకలోని ఒక గ్రామంలోని గ్రామస్తులు పాస్టర్‌పై శారీరకంగా దాడి చేశారు, ఒక కుటుంబాన్ని బహిష్కరించారు, వారికి రేషన్ నిరాకరించారు మరియు వారిని బెదిరించారు. పంజాబ్‌లో దేవాలయంలో  సేవలను నిర్వహించకుండా ఓ లేడీ పాస్టర్‌ను అడ్డుకున్న గుంపు ఆమెను బెదిరించి దుర్భాషలాడింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో చర్చి సేవకులపై దుండగులు  దాడి చేసారు . దేశ రాజధాని న్యూఢిల్లీలో క్రిస్మస్ ప్రార్థనా సమావేశానికి వచ్చిన పాస్టర్‌ను ఒక గుంపు బలవంతంగా అడ్డుకుంది.