బెంగళూరులో మానసిక ఆరోగ్యంపై అవగాహనా సంగోష్ఠి 

భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CBCI) ఆరోగ్య సంరక్షణ విభాగం మరియు కతోలిక 
మానసిక ఆరోగ్యం విభాగం (CMHM) సహకారంతో గురువులకు మరియు ఇతర కతోలిక సభ పెద్దల మానసిక ఆరోగ్యంపై రెండు రోజుల సంగోష్ఠిని నవంబర్ 26 మరియు 27 తేదీలలో బెంగళూరులో నిర్వహించనున్నారు.

"మతపరమైన, గురుత్వ జీవితంలో మరియు వారు చేస్తున్న సేవలో సానుకూల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం" అనే అంశంపై ఈ సంగోష్ఠి జరగనుంది 

గురువులలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు మరియు వారిని బలహీనపరిచే ప్రభావాలను పరిష్కరించడం ఈ సంగోష్ఠి లక్ష్యం.

ఈ సంగోష్టి గురువులు మరియు ఇతర కతోలిక సభ పెద్దలపై పెరుగుతున్న ఆందోళనను, ఒత్తిడి, ఒంటరితనం మరియు ఇతర మానసిక ఆరోగ్య సమస్యల ప్రభావం పరిష్కరిస్తుంది, ఇటువంటు  సవాళ్లు తరచుగా భావోద్వేగ అసమతుల్యత, నిరాశ మరియు ఆత్మహత్య ధోరణులకు దారితీస్తాయి.

గురువులు మరియు ఇతర కతోలిక సభ పెద్దల ఎన్నో సమస్యలు సవ్వళ్ళు ఎదుర్కుంటున్నప్పటికీ సహాయం తీసుకోవడానికి వెనుకాడతున్నారు.

బెంగుళూరు అగ్రపీఠాధిపతులు మహా పూజ్య పీటర్ మచాడో గారు,చంగనాస్సేరి అగ్రపీఠాధిపతులు మహా పూజ్య  థామస్ తరయిల్ గారు,భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CBCI) ఆరోగ్య సంరక్షణ విభాగం నేషనల్ సెక్రటరీ గురుశ్రీ సంతోష్ డయాస్, గారు మరియు ఇతర ప్రముఖ వ్యక్తులు ఈ సంగోష్టికి ముఖ్య అతిధులుగా విచ్చేయనున్నారు.

CBCI మరియు CMHM వారు మానసిక ఆరోగ్య పోరాటాలను గుర్తించడం, దీనిగురించి అవగాహన, మరియు వృత్తిపరమైన మద్దతును ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

మానసిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు మధ్య అంతర్గత సంబంధాన్ని వివరించడం,

ఈ సంగోష్ఠిలో పాల్గొనే వారికి ఆరోగ్యకరమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగించడానికి మానసిక అవసరాలను పరిష్కరించాల్సిన అవసరాన్ని  తెలియపరచనున్నారు