బంగ్లాదేశ్‌ విమాన ప్రమాద భాదితుల కొరకు ప్రార్దించిన పొప్

బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ రాజధాని ఢాకాలోని మైల్‌స్టోన్ స్కూల్ మరియు కళాశాలపై కూలిపోవడంతో కనీసం 31 మంది మరణించారు.

బంగ్లాదేశ్ సైన్యం ప్రకారం మరణించిన వారిలో పైలట్ కూడా ఉన్నాడు మరియు 171 మంది గాయపడిన వారిలో ఎక్కువ శాతం విద్యార్థులు ఉన్నారు.

మంగళవారం జులై 22 న పంపిన టెలిగ్రామ్‌లో, పోప్ లియో విమాన ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టంపై తన విచారం వ్యక్తం చేశారు 

భాదితుల కుటుంబాలు మరియు స్నేహితులు దుఃఖంలో ఓదార్పు పొందాలని మరియు గాయపడిన వారి స్వస్థత చేకూరాలని ప్రార్థిస్తున్నాను" అని హోలీ సీ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్ సంతకం చేసిన సందేశంలో ఉంది

పైలట్ జనసాంద్రత ఉన్న ప్రాంతాలను తప్పించుకోవడానికి ప్రయత్నించారని, కానీ జెట్ రెండంతస్తుల భవనాన్ని ఢీకొట్టిందని సైన్యం తెలిపింది.

విమానం "సాంకేతిక లోపం" ఎదుర్కొందని, ఉన్నత స్థాయి వైమానిక దళ కమిటీ ఈ కారణాన్ని పరిశీలిస్తుందని తెలిపింది.
.