పునీత అన్నమ్మ గారి దేవాలయ ప్రతిష్ఠ

కర్నూలు మేత్రాసనం, ఆదోని విచారణ,బదినహాళ్ పునీత అన్నమ్మ గారి దేవాలయ ప్రారంభోత్సవం జనవరి 29 ,2024 న ఉదయం 10:30  గంటలకు ఘనంగా జరిగింది 

విశ్వాసులు, మేళ తాళాలతో, యువత సాంప్రదాయ నృత్యాలతో కర్నూలు మేత్రాసన పాలనాధికారి గురుశ్రీ ఆంథోనప్ప చౌరప్ప గారికి, ప్రతిష్టోత్సవానికి ఉభయ రాష్ట్రాల నుండి వచ్చిన గురువులకు ఘనంగా స్వాగతం పలికారు.

నూతన హంగులతో, సుందరమైన స్వరూపాలతో, ప్రత్యేక విధంగా నిర్మింపబడిన ఈ ఆలయ ప్రతిష్టోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  

విచారణ కర్తలు గురుశ్రీ కోల విజయరాజు గారు మాట్లాడుతూ దేవాలయ నిర్మాణానికి 10 లక్షల విలువైన సామాగ్రిని ఇచ్చిన శ్రీ నాకేష్ రెడ్డి గారికి, గ్రానెట్ స్టోన్స్ స్పాన్సర్ చేసిన గురుశ్రీ సంగిపాగి శాంత మూర్తి SDB మరియు వారి సోదరులకు, అందమైన మెయిన్ డోర్ స్పాన్సర్ చేసిన ఆదోని- రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ సంగిపాగి లూర్దయ్య గారికి  మరియు UPVC కిటికీలు మరియు వెంటిలేటర్‌లను స్పాన్సర్ చేసిన నంద్యాల - శ్రీ  ఆవుల అరుణ, ఆమె కుమార్తె డాక్టర్ వినీత, కుమారుడు శ్రీ వినయ్ గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం సామూహిక ప్రార్థనతో ప్రారంభోత్సవం ముగిసింది.