పరమపదించిన 'సిస్టర్ మేరీ ఇమ్యాక్యులేటా ఆఫ్ జీసస్'

పరమపదించిన  'సిస్టర్ మేరీ ఇమ్యాక్యులేటా ఆఫ్ జీసస్'

విశాఖ అతిమేత్రాసనం,  జ్ఞానాపురం లోని రక్షణ గిరి పై ఉన్న'క్రీస్తు రాజు నిత్యారాధన ఆశ్రమం'(Christ the King Adoration Monastery) లో 1986 నుంచి నమ్రతగల హృదయం తో  ప్రార్థన సేవ చేస్తూ ఎందరో కతోలిక  కన్యస్త్రీలకు ఆదర్శ వ్యక్తిగా, మార్గ చూపరిగా నిలిచి,
 గొప్ప సిస్టర్ గా కీర్తిని సంపాదించిన 'మేరీ ఇమ్మ్యాక్యులేటా ఆఫ్ జీసస్ ('𝗠𝗔𝗥𝗬 𝗜𝗠𝗠𝗔𝗖𝗨𝗟A𝗧𝗔 𝗢𝗙 𝗝𝗘𝗦𝗨𝗦) గారు మార్చ్ 7 శుక్రవారం నాడు 'రక్షణ గిరి' పై ఉన్న ఆశ్రమంలో మరణించారు.

సిస్టర్ గారి  'భూస్థాపన కార్యక్రమానికి' ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య పొలిమేర జయరావు గారు , విశాఖ అతిమేత్రాసన విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ గారు, విశాఖ అతిమేత్రాసన ఛాన్సలర్ శ్రీ జొన్నాడ జాన్ ప్రకాశ్ గారు,గురుశ్రీ  థామస్ పుల్లాట్ గారు , నిత్య ఆరాధన ఆశ్రమం మఠకన్యలు, మరియు అధిక సంఖ్యలో గురువులు, విశ్వాసులు  పాల్గొన్నారు.

సిస్టర్ గారు 1929 డిసెంబర్ 18న కేరళ లో జన్మించారు. 1956 లో దేవుని పిలుపును అందుకొని కన్యస్త్రీగా అభిషేకించబడ్డారు.  'క్విలోన్' ఆశ్రమంలో 30 ఏళ్లు పాటూ సేవ చేసారు. 'దైవ నిర్ణయం' ప్రకారం 1986లో విశాఖ వచ్చి, జ్ఞానాపురం 'రక్షణ గిరి' పై ఉన్న 'క్రీస్తు రాజు నిత్యారాధన మఠకన్యల ఆశ్రమం' లో చేరారు. అప్పటినుండి సిస్టర్ గారు  గొప్ప ప్రార్థనా జీవితం గడిపారు. తన 95 సంవత్సరాల జీవిత కాలంలో -  సిస్టర్ గా ' 75 సంవత్సరాలు దేవుని సేవలో ఉంటూ  ధన్య జీవితం ' జీవించారు. గతంలో 'పునీత మదర్ థెరెసా' గారు కూడా ఈ ఆశ్రమాన్ని దర్శించారు.

ప్రపంచ శాంతి కొరకు, ప్రజలలో భక్తి భావం పెంపొందేందుకు. నిరంతరం పరితపించి, దేవుని సేవకు తన జీవితాన్ని అర్పించి, ఎందరో పేదవారికి అండగా నిలిచారు.

ఆమె 'భూస్థాపన కార్యక్రమంలో అధికసంఖ్యలో నగర కతోలికులు, విచారణ PCC సభ్యులు, ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ ప్రతినిధులు,  ప్రజలు  హాజరయ్యారు.

News Source: Rakshanagiri,Gnanapuram
Design By M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer