నెల్లూరులో చెరసాల పరిచర్య వార్షిక సమావేశం

ఫిబ్రవరి 29,2024 న సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు నెల్లూరు మేత్రాసనంలోని కనిగిరి విచారణ నందు గురుశ్రీ సిహెచ్ భాస్కర్ గారి సారథ్యంలో, గురుశ్రీ యమ్ హృదయరాజు గారి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చెరసాల పరిచర్య సమన్వయకర్త గురుశ్రీ పసల లహాస్త్రాయ అధ్యక్షతన చెరసాల పరిచర్య మేత్రాసన వార్షిక సమావేశం జరిగింది.

ప్రకాశం జిల్లా చెరసాల పరిచర్య స్వచ్చంద కార్యకర్తలు పాల్గొన్నారు 

ఈ సమావేశంలో గురుశ్రీ సిహెచ్ భాస్కర్ గారు వారి గురుత్వజీవితంలో చేసిన చెరసాల పరిచర్య ద్వారా అభివృద్ధిచెందిన వారి గురించి మాట్లాడారు.  

గురుశ్రీ యమ్ హృదయరాజు గారు వారు గురువిద్యార్దిగా మరియు గురువుగా ఈ పరిచర్యలో తమ స్వీయ అనుభవాలను అందరితో పంచుకున్నారు.

చెరసాల పరిచర్య బైబిల్ పరంగాను మరియు ఆధ్యాత్మిక పరంగాను మన ప్రభువైన క్రీస్తు స్థాపించారని లూకా శుభవార్త 4 అధ్యాయం 16 -21 వచనాలు చదివి మన యేసుప్రభువే ఈ చెరసాల పరిచర్య ప్రారంభించారని, శ్రీసభలో చెరసాల పరిచర్య చరిత్రను వివరించారు.

విశ్వాసులు ఎన్నో సంవత్సరాలనుండి ఈ పరిచర్యలో స్వచ్చందంగా ఎలా పాల్గొంటునారని తెలిపారు.

నెల్లూరు పీఠాధిపతులు మహా పూజ్య ఎం డి ప్రకాశం, చెరసాల పరిచర్య విభాగ అధ్యక్షులు కార్డినల్ మహా పూజ్య అంతోని పూల గార్లకి ఈ అవకాశం అందించినందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చెరసాల పరిచర్య సమన్వయకర్త గురుశ్రీ పసల లహాస్త్రాయ గారు కృతజ్ఞతలు తెలియచేసారు.