నూతన నియామకం

సిబు అగ్రపీఠానికి సహాయక పీఠాధిపతిగా మోనెసిగ్నోర్ రూబెన్ లాబాజో గారిని ప్రాన్సిస్ జగద్గురువులు నియమిస్తూ 23 జూన్ 2022 న ప్రకటన చేసారని

రూబెన్ లాబాజో గారు సెప్టెంబరు 24, 1966న తలిసే నగరంలో జన్మించారు.

తను సిబూలోని సాన్ కార్లోస్ సెమినరీలో తన తత్వశాస్త్రం మరియు వేదాంతశాస్త్ర అధ్యయనాలను పూర్తి చేశారు.

జూన్ 10, 1994న సెబూ అగ్రపీఠానికి గురువుగా అభిషెక్తులయ్యారు.
 1995 నుండి 1997 వరకు మాండౌ విచారణ వికార్‌గాను; బంటాయన్ ద్వీపంలోని శాంటా ఫే విచారణ పాస్టర్ గాను; మరియు సెయింట్ జోసెఫ్ విచారణ మోడరేటర్ గా, 2014 నుండి 2019 సెబు మెట్రోపాలిటన్ కేథడ్రల్ మోడరేటర్‌గా మరియు మోస్ట్ హోలీ రోసరీ వికార్ ఫోరేన్‌ వికారియేట్ గా సేవలందించారు.

2020లో, బిషప్-ఎలెక్ట్ చేయబడిన బాలంబన్ పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ అస్సిసి విచారణ  వికార్ జనరల్ మరియు మోడరేటర్‌గా నియమితులయ్యారు.

అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ, వారు సేవా పరిచర్యలో దినదినాభివృది చెందేలా దేవుడు ఆశీర్వదించి, దీవించాలని మనసారా కోరుకుంటున్నాం.

Add new comment

1 + 17 =