నూతన దివ్య సప్రసాదం స్వీకరించిన వృద్దులు

నూతన దివ్య సప్రసాదం స్వీకరించిన వృద్దులు 

ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలలో పూణే మేత్రసనం వారు "మొబైల్ మిషన్ కన్వెన్షన్ ను నిర్వహిస్తున్నారు. అందులోని భాగంగా ఆంధ్ర మరియు  తెలంగాణ  ప్రాంతాలలో ప్రార్థన కూటములు నిర్వహిస్తున్నారు. సిరియన్ మలంకర క్యాథలిక్ మిషనరీ గురువులు మరియు సిస్టర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  

గురుశ్రీ పల్లి సెభాస్టియన్ గారు  ప్రజల విశ్వాసాన్ని పెంచుతూ  వారిని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. దేవాలయానికి ప్రజలకు మంచి సంబంధాన్ని ఏర్పరుస్తూ వారు ముందుకు సాగుతున్నారు. 

రేపల్లె విచారణలో  తమ ప్రార్థన సహాయాన్ని అందిస్తూ  ప్రతిరోజూ జపమాల ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. గురుశ్రీ పల్లి సెభాస్టియన్ గారితో పాటు ఈ కార్యక్రమంలో బెథానీ సిస్టర్స్ (The Congregation of the Sisters of the Imitation of Christ (SIC),Bethany Sisters) లు కూడా పాల్గొన్ని తమ సహాయాన్ని అందిస్తున్నారు. 

జంగంలంక గ్రామంలోని "క్రీస్తు రాజు" మలనకర దేవాలయంలోని ముగ్గురు విచారణ సభ్యులు (మెల్చియర్, ఎస్తేర్, ఎలిజబెత్)లు నూతన దివ్య సప్రసాదం స్వీకరించారు. దేవుని తీసుకొని గత కొన్ని సంవత్సరాలుగా దేవాలయానికి వస్తున్నారు. ప్రతి రోజు ప్రార్థనలలో పాల్గొంటూ వారు ఆధ్యాత్మికంగా సిద్ధపడ్డారు.  దేవుతో జీవించాలనే కోరికతో వారి వృద్ధ జీవితంలో ప్రార్థనలన్నీ నేర్చుకుని దివ్య సప్రసాదం స్వీకరించి అందరికి ఆదర్శంగా నిలిచారు. 

గురుశ్రీ పల్లి సెభాస్టియన్ గారు వారి విశ్వాసాన్ని మరియు పట్టుదలను కొనియాడారు. 
దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధించే అవకాశం కల్పించిన "మా ప్రియమైన అబూన్ మత్త్యూస్ మార్ పకో మియోస్" (పీఠాధిపతులకు) గురుశ్రీ పల్లి సెభాస్టియన్ గారు కృతజ్ఞతలు తెలిపారు.   

Article and design By M kranthi Swaroop