'ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్' | తెలుగు వెర్షన్ ఆవిష్కరణ

'ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్' | తెలుగు వెర్షన్ ఆవిష్కరణ
క్రైస్తవ మతానికి బలిదానం కొత్త కాదు...'ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్' ఈ చిత్రం ఉత్తర భారతదేశంలో పిల్లలకు విద్య మరియు సంరక్షణ మరియు సాధికారత కోసం కృషి చేసిన సిస్టర్ రాణి మారియా గారి జీవితం.ఇది 2023లో విడుదలైన మలయాళ భాషా చిత్రం. ఈ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మరియు దేశంలోని ఇతర ప్రాంతాలలో విడుదల అవ్వనున్నది.
తెలుగు పీఠాధిపతుల సమాఖ్య (TCBC) సమావేశంలో "ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్" యొక్క తెలుగు వెర్షన్‌ను మహా ఘన కార్డినల్ పూల అంతోని గారు మరియు టీసీబీసీ పీఠాధిపతులు అందరు ఆవిష్కరించారు. FCC సిస్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేరళలో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న విన్సీ అలోషియస్ సిస్టర్ రాణి మారియా పాత్రను పోషించింది. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన డాక్టర్ షైసన్ పి ఔసేఫ్ గారు దీనికి దర్శకత్వం వహించారు. డాక్టర్ సాండ్రా డిసౌజా రానా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే 58 కి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం 2024లో జరిగిన 96వ అకాడమీ అవార్డులలో ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగాలకు ఆస్కార్ అర్హత జాబితాలో చోటు సంపాదించింది.
సిస్టర్ రాణి మారియా గారు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పేద మరియు అణగారిన ప్రజల మధ్య పనిచేసారు. ఈమె ఫ్రాన్సిస్కాన్ క్లారిస్ట్ కాంగ్రిగేషన్ (FCC)సభకు చెందినవారు. భూమిలేని పేద మరియు అణగారిన ప్రజల కొరకు రాణి మారియా చేస్తున్న పోరాటాలతో కలత చెందిన స్థానిక వడ్డీ వ్యాపారులు మరియు భూస్వాముల ఆదేశం మేరకు సమందర్ సింగ్ అనే వ్యక్తి ఆమెను చంపాడు. ఫిబ్రవరి 25, 1995న, ఒక ప్రైవేట్ బస్సులో వెళ్తున్న రాణి మారియా గారి ని అనేకసార్లు కత్తితో పొడిచి ఆమెను చంపాడు.
1992లో సిస్టర్ చేరిన ఉదయనగర్ మిషన్ పరిధిలోకి వచ్చే అనేక గ్రామాలలో ఒకటైన కాలాపాని అనే గ్రామాన్ని సందర్శించిన మొదటి క్రైస్తవ మిషనరీ రాణి మారియా గారు. సిస్టర్ రాణి మారియా ప్రమేయాన్ని ఆమె మతతత్వం కారణంగా మొదట్లో ప్రశ్నించిన వారందరూ చివరికి ఆమెకు బలమైన మద్దతుదారులుగా మారారు.
Article and designed by M Kranthi Swaroop