దాన వరద భాదితులకు సహాయాన్ని అందిస్తున్న స్పెయిన్‌

గత వారం వాలెన్సియాలోని దక్షిణ ప్రాంతాన్ని నాశనం చేసిన వరదల నేపథ్యంలో స్పెయిన్‌లోని చర్చి సహాయక చర్యల అందించడంలో ముందు వరుసలో ఉంది.

వరదలు అక్టోబరు 29న ప్రారంభమయ్యాయి, ఆకస్మిక వర్షపాతం దాని మార్గంలో దాదాపు ప్రతిదీ తుడిచిపెట్టుకుపోయింది. 

ప్రతిస్పందించడానికి సమయం లేకపోవడంతో, చాలా మంది ప్రజలు తమ కార్లలో, ఇళ్లలో మరియు వ్యాపార స్థలంలో చిక్కుకుని చనిపోయారు.

ఆదివారం, మృతుల సంఖ్య 217కి పెరిగింది, ఇంకా చాలా మంది గాలంతయ్యారు
DANA తో పిలువబడే ఈ తుఫాను, నీరు, ఆహారం, విద్యుత్ మరియు ఇతర ప్రాథమిక సేవలకు ప్రాప్యత లేకుండా అనేక గృహాలను విచ్చిన్నంచేసింది

ఆదివారం త్రికాల ప్రార్థన సమయంలో పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్ గారు వాలెన్సియా ప్రజలకు తన సాన్నిహిత్యాన్ని పునరుద్ఘాటించారు మరియు ప్రభావితమైన వారందరికీ ప్రార్థన మరియు మద్దతు అందించాలని విశ్వాసులను ఆహ్వానించారు.

కథోలికులకు సహాయ విభాగం అయిన కారితాస్ స్పెయిన్, స్థానిక అధికారుల సమన్వయంతో బాధిత కుటుంబాలకు మద్దతు ఇచ్చింది. 

వాలెన్సియా మరియు అల్బాసెట్‌లోని కారితాస్ సంస్థలతో కలిసి అత్యవసర పరిస్థితికి స్పందించడానికి వెంటనే సమాయత్తమైంది.

 "జాతీయ,ప్రాంతీయ,మేత్రాసన మరియు విచారణ స్థాయిలో కారితాస్ నెట్‌వర్క్ నిబద్ధతను" కారితాస్ అల్బాసెట్ డైరెక్టర్ రోసా గార్సియా వివరించారు.

స్థానిక మతాధికారులకు ఉద్దేశించిన సందేశంలో, నవంబర్ 9 మరియు 10 తేదీలలో మేత్రాసన దినోత్సవం వార్షిక సేకరణ పూర్తిగా ప్రభావితమైన విచారణలకు విరాళంగా ఇవ్వబడుతుందని వాలెన్సియా అగ్రపీఠం ప్రకటించింది.

వీధులు, గృహాలు, వాణిజ్య సంస్థలు మరియు వరదలకు గురైన దేవాలయాల నుండి మందపాటి బురద పొరలను తొలగించడానికి వేలాది మంది వాలంటీర్లు ముందుకు వచ్చారు.

వారిలో అగ్రపీఠం వివిధ ప్రాంతాల నుండి గురువులు, మఠకన్యలు మరియు యువ వాలంటీర్లు ఉన్నారు.

కారిటాస్ వాలెన్సియా ద్వారా ప్రత్యక్ష ఆర్థిక విరాళాలు అభ్యర్థించబడినప్పుడు, వాలెన్షియన్ విచారణలు మరియు స్థానిక మేత్రాసనాల గ్రూపులు బట్టలు, ఆహారం మరియు అవసరమైన వస్తువులను సేకరించడం కొనసాగించాయి.

వాటిలో న్యూస్ట్రా సెనోరా డి గ్రేసియా డి లా టోర్రే యొక్క విచారణ  ఉంది, ఇది వాలెన్సియాలోని వరదకు గురైన ప్రాంతాలలో ఒకటి, ఇక్కడ మున్సిపాలిటీ మరియు సివిల్ ప్రొటెక్షన్‌తో సమన్వయంతో మరియు 200 మంది వాలంటీర్ల సహాయంతో ఆహార పంపిణీ కోసం సేకరణ కేంద్రం ఏర్పాటు చేయబడింది.

వాలెన్షియన్ ప్రో-లైఫ్ అసోసియేషన్ "ప్రోవిడా" విపత్తు వల్ల ప్రభావితమైన పిల్లలకు అవసరమైన వస్తువులను సేకరించడానికి దాని తలుపులు తెరిచింది. 

దుప్పట్లు, పాలు, పిల్లల ఆహారం, శిశువులకు వెచ్చని బట్టలు మరియు పిల్లల వస్తువులను సేకరించడానికి వాలంటీర్లు అక్కడ ఉన్నారు.

ఈ దాతృత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ దీనిని "ఆశకు నిదర్శనం" మరియు మానవ సంఘీభావంగా అభివర్ణించారు అని కారితాస్ వాలెన్సియా డైరెక్టర్ అరోరా అరండా అన్నారు