తమ దృష్టిని మోక్షం వైపు మళ్లించమన్న పోప్ ఫ్రాన్సిస్
డిసెంబర్ 1 , 2024 ఆగమన కాలం మొదటి ఆదివారం మధ్యాహన త్రికాల ప్రార్థన సమయంలో
ప్రతి ఒక్కరూ తమ దృష్టిని మోక్షం వైపు మళ్లించమన్న పోప్ ఫ్రాన్సిస్ కోరారు
మన అనుదిన సిలువలను మోస్తూ, మన విశ్వాస ప్రయాణంలో మనల్ని ఆదుకునే ప్రభువుకు మన హృదయాలను తెరవాల్సిందిగా ఆయన అన్నారు.
దేవునికి ఇష్టమైన ప్రజలుగా మనము మనుగడ సాగించాలంటే మనము తప్పక జాగరూకులై ఉండవలసిన అవసరముందని పోప్ గారు అన్నారు
క్రైస్తవ జీవితాన్ని ఒక సవాలుగా తీసుకొని, క్రీస్తుప్రభుని రెండవ రాకకై ఎదురుచూడాలని,మన హృదయాలను పవిత్ర పరచుకొని, క్రిస్మస్ పండుగకు మనల్ని మనం సిద్ధపరుచుకోవాలని ఆయన విశ్వ శ్రీసభను కోరారు.