జ్యోతిర్మయి లో జరిగిన TCBC ప్రాంతీయ డైరెక్టర్ల వార్షిక సమావేశం

డైరెక్టర్ల వార్షిక సమావేశం
జ్యోతిర్మయి

19 జనవరి 2024 న సికింద్రాబాద్ లోని జ్యోతిర్మయి లో TCBC (తెలుగు పీఠాధిపతుల సమాఖ్య) ప్రాంతీయ డైరెక్టర్ల వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ కమిషన్ల డైరెక్టర్లు వారి వార్షిక నివేదికలను సమర్పించారు. 

TCBC జనరల్ సెక్రటరీ మరియు కోశాధికారి అయిన మహా పూజ్య తెలగతోటి రాజారావు గారి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.

ఈ సమావేశాన్ని TCBC ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గురుశ్రీ రాజు అల్క్స్  గారు నడిపించారు. ఉదయం 9 : 30 గంటలకు ప్రారంభమయ్యింది. మొదటగా గురుశ్రీ రెక్స్ ఏంజిలో గారు తన సందేశాన్ని డైరెక్టర్లకు అందించారు. సమావేశానికి హాజరైన డైరెక్టరలందరికి  గురుశ్రీ రాజు అల్క్స్  గారు ధన్యవాదాలు తెలిపారు.