జె.యమ్జె. సభకు నూతన సమాలోచన సభ్యుల ఎన్నిక

నవంబర్ 3  ,2024  ఆదివారం హైదరాబాద్ అగ్రపీఠం, JMJ హైదరాబాద్ ప్రావిన్స్ నూతనంగా ఎన్నికైన సమాలోచన సభ్యుల ప్రతిష్ట దివ్యబలి పూజ సోమాజిగుడా, జె యమ్ జె ప్రావిన్సెల్టె నందు ఘనంగా జరిగింది.

మధ్యప్రదేశ్, రాయగఢ్ మేత్రానులు మహా పూజ్య పాల్ టోపో గారు దివ్యబలి పూజను సమర్పించారు.

హైదరాబాద్ అగ్రపీఠ ఛాన్సలర్ మరియు ప్రొక్యూరేటర్ గురుశ్రీ విక్టర్ ఇమ్మానుయేల్ వారి ప్రసంగంలో మఠవాస జీవితం గురించి,ప్రొవిన్సియల్ సమాలోచన సభ్యులుగా తాము ఎదురుకోబోతున్న సవాళ్లను దేవుని శక్తితో ఆత్మ బలముతో ఎదురుకొని తమ ప్రేషిత కార్యని, వారియొక్క సంస్థను ముందుకు తీసుకు వెళ్లాలని ఆయన అన్నారు.

ఈ దివ్యబలి పూజలో అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు, జ్యోతిర్మయి సంస్థ డైరెక్టర్ గురుశ్రీ మాదాను అంతోని గారు పాలుపంచుకున్నారు 

జె యమ్ జె సభ హైదరాబాద్ ప్రావిన్స్ కు చెందిన సిస్టర్లు సుమారు వంద మందికి పైగా పాల్గొని వీరికొరకు ప్రార్ధించారు.

ఎన్నికైన నూతన ప్రొవిన్సియల్ సిస్టర్ నూసి పౌలిన గారు  మరియు సమాలోచన సభ్యులు సిస్టర్ శౌరీలు గుండిగ, సిస్టర్ నిర్మల జిడ్డు మరియు సిస్టర్ తంగం పులియని గార్లు తమ మాట పట్టును చేశారు.

విచ్చేసిన మధ్యప్రదేశ్, రాయగఢ్ మేత్రానులు మహా పూజ్య పాల్ టోపో గారికి, గురు పుంగవులకు సిస్టర్ లలితా కరణం గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ ప్రావిన్స్ తరపున ప్రొవిన్సియల్ సిస్టర్ నూసి పౌలిన గారు పీఠాధిపతులవారికి, గురువులకు, సభ కన్యాస్త్రీలకు, సమాలోచన సభ్యులకు ధన్యవాదాలు తెలియచేసారు.

Tags