జాతీయ నిరసన దినం" - గుంటూరు మేత్రాసనం
జాతీయ నిరసన దినం" - గుంటూరు మేత్రాసనం
హిందూ మత దళితులకు భారతీయ చట్టం ప్రకారం రిజర్వేషన్లు & రక్షణలు ఇవ్వబడ్డాయి, అయితే దళిత క్రైస్తవులు & దళిత ముస్లింలకు రిజర్వేషన్లు & రక్షణలు ఇవ్వలేదు.
అందువల్ల దళిత క్రైస్తవులు & దళిత ముస్లింలందరూ ప్రతి ఆగస్టు 10 వ తేదీని "బ్లాక్ డే" గా పాటిస్తారు మరియు ఈ వివక్షతతో కూడిన రాష్ట్రపతి ఉత్తర్వును రద్దు చేయడానికి ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో నిరసనను నిర్వహిస్తారు.
గుంటూరు మాత్రాసనం లో ఈ "బ్లాక్ డే నిరసన" నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్, ఆంధ్ర కౌన్సిల్ ఆఫ్ చర్చిస్, కమిషన్ ఫర్ ఎస్సీ & బిసి మరియు వివిధ దేవాలయ గురువులు ,పాస్టర్లు , నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈరోజు జరిగిన నిరసన కార్యక్రమంలో మేత్రాసన ఆధ్యాత్మిక గురువులు యడ్లపాడు విచారణ కర్తలు గురుశ్రీ కొండవీటి బోస్ గారు, గురుశ్రీ చంద్ర గారు ఇతర గురువులు పాల్గొని తమ నిరసనను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఇతర కాథలిక్ గురువులు , సిస్టర్స్ , దళిత క్రిస్టియన్ & దళిత ముస్లిం నాయకులు పాల్గొన్నారు.
దళిత క్రైస్తవులు మరియు దళిత ముస్లింలు చేస్తున్న ఈ పోరాటం ప్రభుత్వం గౌరవించి రాజ్యాంగ మత స్వేచ్ఛను కల్పించాలని అమృతవాణి మరియు రేడియో వెరిటాస్ ఆసియ కోరుకుంటున్నాం.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer