చిలీకి నూతన అపోస్తొలిక రాయబారిని నియమించిన పొప్ ఫ్రాన్సిస్

17 మార్చి 2025 న సిరో-మలబార్ కు చెందిన అగ్రపీఠాధిపతి మార్ కురియన్ మాథ్యూను చిలీకి నూతన పొప్ రాయబారిగా నియమించారు

మహా పూజ్య కురియన్ గత ఐదు సంవత్సరాలుగా అల్జీరియా మరియు ట్యునీషియాకు  (Algeria and Tunisia)పొప్ రాయబారిగా పనిచేశారు.

నీందూర్ విచారణకు చెందిన ఆయన 4 ఆగస్టు 1966న జన్మించారు.

1998లో రోమ్‌లోని పోంటిఫికల్ యూనివర్శిటీ ఆఫ్ ది హోలీ క్రాస్ నుండి కానన్ లాలో డాక్టరేట్ పొందిన తర్వాత, ఆయన వాటికన్‌లో దౌత్య శిక్షణ పొందారు మరియు హోలీ సీ దౌత్య దళంలో తన సేవను ప్రారంభించారు.

గినియా, కొరియా, డొమినికన్ రిపబ్లిక్, బంగ్లాదేశ్, హంగేరీ మరియు ఈజిప్టులోని ఆయన విస్తృతమైన దౌత్య వృత్తిలో సేవను అందించారు.

ఆయన పాపువా న్యూ గినియా మరియు సోలమన్ దీవులలో కూడా పొప్ రాయబారిగా పనిచేశారు.