ఘనంగా పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవము

ఘనంగా పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవము

విశాఖ అతిమేత్రాసనం,  మధురవాడ విచారణలో గల  పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి దేవాలయంలో పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవము ఘనంగా జరిగింది. విచారణ గురువులు గురుశ్రీ  ప్రకాష్ (TOR) గారి ఆధ్వర్యంలో ఈ మహోత్సవము ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది.

 24-9-2024 నుండి 2-10-2024 వరకు భక్తియుతంగా నవదిన ప్రార్థనలు జరిగాయి. పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి పండుగ రోజు అనగా  తేది 4-10-2023 బుధవారం నాడు అధిక సంఖ్యలో గురువులు ,మఠకన్యలు, విశ్వాసులు పాల్గొన్నారు.

ఉదయం 7 గంటలకు ఇంగ్లీష్ లో దివ్య బలిపూజను MSFS ప్రొవెన్సియల్ సుపీరియల్, గురుశ్రీ బవిరి సురేష్ బాబు గారు ఇతర గురువులతో కలసి సమర్పించారు.  సాయంత్రం  4:30 గంటలకు అధికసంఖ్యలో విశ్వాసులు పాల్గొనగా పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి తేరు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.
 
అనంతరం సాయంత్రం  5:30 గంటలకు సమిష్టి పండుగ కృతజ్ఞతా దివ్వబలిపూజను విశాఖ అతిమేత్రాసన ఛాన్సలర్ గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ గారు ,ఇతర గురువులతో కలసి సమర్పించారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు. విచారణ యువత తమ సహాయ సహకారాలను అందించారు.

విచారణ గురువులు గురుశ్రీ ప్రకాష్ గారు ప్రజలందరి కొరకు ప్రేమ విందుని ఏర్పాటుచేశారు. పండుగకు సహకరించిన ప్రతి ఒక్కరికి గురుశ్రీ ప్రకాష్ గారు ధన్యవాదాలు తెలియజేసారు.


Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer