ఘనంగా జరిగిన మహా పూజ్య సగిలి ప్రకాష్ గారి పీఠాధిపతి అభిషేక మహోత్సవం

ఘనంగా జరిగిన మహా పూజ్య సగిలి ప్రకాష్ గారి పీఠాధిపతి అభిషేక మహోత్సవం

ఖమ్మం మేత్రాసనానికి నూతన పీఠాధిపతిగా నియమితులైన మహా పూజ్య సగిలి ప్రకాష్ గారి పీఠాధిపతి అభిషేక మహోత్సవం 9 ఏప్రిల్ 2024 న ఖమ్మంలోని కరుణగిరి పుణ్యక్షేత్రంలో ఘనంగా జరిగింది.

ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. దివ్యబలిపూజను హైద్రాబాద్ అగ్రపీఠాధిపతి కార్డినల్ మహా పూజ్య పూల అంతోని గారితో కలిసి ఇతర పీఠాధిపతులు, ఖమ్మం మేత్రాసన గురువులు, కడప మేత్రాసన గురువులు మరియు ఇతర కలిసి నిర్వహించారు.

విజయవాడ పీఠాధిపతి మహా పూజ్య తెలగతోటి రాజారావు గారు నూతనంగా పీఠాధిపతికి కావలసిన మూడు లక్షణాలను గూర్చి ప్రసంగించారు. కార్డినల్ మహా పూజ్య పూల అంతోని గారు, ఖమ్మం మేత్రాసన పాలనాధికారి మహా పూజ్య ఉడుమల బాల గారు మరియు కడప మేత్రాసన పాలనాధికారి మహా పూజ్య గాలి బాలి గారు సమిష్టిగా నూతన పీఠాధిపతి అభిషేకించారు.

దివ్యబలిపూజ అనంతరం నూతన పీఠాధిపతి మహా పూజ్య సగిలి ప్రకాష్ గారు తన అభిషేక మహోత్సవానికి విచ్చేసిన వారందరికి తన హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు.