గొఱ్ఱెల కాపరులు, ముగ్గురు జ్ఞానుల వలె మనం యేసును వెతకాలన్న పోప్ ఫ్రాన్సిస్

ముగ్గురు జ్ఞానుల పండుగ రోజు త్రికాల ప్రార్ధన సమయంలో మన జీవితంలోకి ఆ చిన్నారి బాల యేసుని ఎలా ఆహ్వానిస్తున్నామో పరిశీలించుకోవాల అన్న పోప్ ఫ్రాన్సిస్

"గొఱ్ఱెల కాపరులు మరియు జ్ఞానులు యేసును కనుగొనినట్లుగా మనం కూడా , పేదలలో, దివ్యసత్ప్రసాదంలో, అనాథలలో, మన సోదరులలో ఆ యేసును కనుగొనేలాగున  ప్రార్థించమని పోప్ ఫ్రాన్సిస్ ఉద్బోధించారు.

ముగ్గురు జ్ఞానులు రక్షకుడిని చూడటానికి ప్రతి కష్టాన్ని అధిగమిస్తూ, మానవజాతి చరిత్రలో ప్రత్యేకమైనది ఏదో జరుగుతోందని వారికి తెలిసి,వారు ఈ సంఘటనను కోల్పోకూడదనుకున్నారో అల్లాంటి స్ఫూర్తిని కలిగి మనం కూడా ఉండాలని ఆ దేవునికి దగ్గర అవ్వాలని పోప్ ఫ్రాన్సిస్ కోరారు.

పేదలలో, దివ్యసత్ప్రసాదంలో, అనాథలలో, మన సోదరులలో ఆ యేసును కనుగొనేలాగున మనకు సహాయం చేయమని ఆ మరియతల్లిని ప్రార్దిదాం అని పోప్ ఫ్రాన్సిస్ ముగించారు

Tags