క్రైస్తవ పాఠశాలల పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన సత్య రంజన్ బోరా
క్రైస్తవ పాఠశాలల పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన సత్య రంజన్ బోరా
ఈశాన్య అస్సాం రాష్ట్రంలోని ఒక హిందూ సంఘ నాయకుడు సత్య రంజన్ బోరా పాఠశాలలపై చట్టపరమైన చర్యలకు సిద్దమయ్యాడు.
కుటుంబ సురక్ష పరిషత్ (కుటుంబ భద్రతా మండలి)కి నాయకత్వం వహిస్తున్న సత్య రంజన్ బోరా పాఠశాల ఆవరణల నుండి క్రైస్తవ చిహ్నాలను తొలగించాలి అని గడువును విధించాడు. అయితే అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి క్రైస్తవ పెద్దలు ,నాయకులూ ఫిర్యాదు చేసారు. ఇచ్చిన గడువు పూర్తయిన పాఠశాలనుండి ఎటువంటి స్పందన లేనందున రాష్ట్రంలో శ్రీసభ నిర్వహిస్తున్న పాఠశాలలపై సత్య రంజన్ బోరా చట్టపరమైన చర్యలకు ప్లాన్ చేశాడు.
సత్య రంజన్ బోరా మాట్లాడుతూ, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో కేసు దాఖలు చేయడానికి తన సన్నాహాలు పూర్తయ్యాయని చెప్పాడు.
ఫిబ్రవరి 7న రాష్ట్రంలోని అన్ని క్రైస్తవ పాఠశాలలకు 15 రోజుల గడువును విధించింది, పాఠశాల ఆవరణలు మరియు తరగతి గదుల నుండి శిలువలు మరియు విగ్రహాలు వంటి అన్ని క్రైస్తవ చిహ్నాలను తొలగించాలి అని, గురువులు (Fathers) మరియు సన్యాసినులు(Sisters) తమ మతపరమైన దుస్తులలో కాకుండా సివిల్ డ్రెస్‌లో పాఠశాలలకు రావాలని డిమాండ్ చేసింది.
సత్య రంజన్ బోరా బహిరంగంగా మీడియా సమావేశంలో ఈ డిమాండ్లు చేశాడు, విఫలమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు.అస్సాం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని నడుపుతోంది.
మిషనరీ పాఠశాలలను క్రైస్తవ చిహ్నాలు లేకుండా ఉంచాలని బోరా గౌహతి అగ్రపీఠాధిపతి మహా పూజ్య జాన్ మూలచిరా గారికి లేఖ రాశాడు.
తాజా బెదిరింపుపై స్పందిస్తూ, అగ్రపీఠాధిపతి మహా పూజ్య మూలచిరా గారు UCA
(Union of catholic Asian news ) న్యూస్‌తో మాట్లాడుతూ, బోరా "భారతదేశంలోని ఇతర పౌరుల మాదిరిగానే కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు అని అన్నారు.
"మేము కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇచ్చాము," అని పీఠాధిపతి చెప్పారు. క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడానికి మిషనరీ పాఠశాలలను ఉపయోగిస్తున్నారనే ఆరోపణను తోసిపుచ్చారు.
పేద గిరిజన ప్రజలు నివసించే అస్సాంలోని మారుమూల ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీలు అనేక దశాబ్దాలుగా విద్యా సేవలో నిమగ్నమై ఉన్నారు అని గుర్తు చేసారు.
“మా విద్యా సంస్థలు, హాస్పిటల్స్ పేదలకు మరియు అవసరంలో ఉన్నవారికి సేవ చేస్తూ తద్వారా దేశానికి సేవ చేస్తున్నాయి. కానీ, దురదృష్టవశాత్తు, అలాంటి సంస్థలు అనవసరంగా మత మార్పిడి వంటి తప్పుడు ఆరోపణలకు లాగబడుతున్నాయి, ”అని పీఠాధిపతి పేర్కొన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer