క్రైస్తవుని విశ్వాస జీవితానికి తీర్థయాత్రలు 'ముఖ్యమైనవి': పోప్ లియో XIV

క్రైస్తవుని విశ్వాస జీవితానికి తీర్థయాత్రలు 'ముఖ్యమైనవి': పోప్ లియో XIV
మన ప్రభువైన యేసుక్రీస్తుతో ఐక్యంగా ఉండటానికి మరియు జీవితంలో మన పట్ల దేవుని ఉద్దేశ్యాన్ని గ్రహించడానికి తీర్థయాత్రలు సహాయపడతాయని, అవి విశ్వాస జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశుద్ధ పోప్ లియో XIV గారు అన్నారు.
శనివారం నాడు జూబ్లీ 2025 "ఇయర్ ఆఫ్ హోప్" కోసం రోమ్ లో వేసవి తీర్థయాత్ర చేస్తున్న డెన్మార్క్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ మరియు వేల్స్ వచ్చిన యాత్రికులతో పరిశుద్ధ పోప్ లియో XIV గారు సమావేశమయ్యారు. వాటికన్‌కు వచ్చిన ఉపాధ్యాయులు మరియు యువకులను (యాత్రికులను) వాటికన్‌కు ఆహ్వానించారు మరియు వారిని ప్రోత్సహించారు.
ఈ సందర్భముగా పరిశుద్ధ పోప్ లియో XIV గారు మాట్లాడుతూ "తీర్థయాత్ర మన విశ్వాస జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది అని , ఎందుకంటే అది మన ఇళ్ల నుండి మరియు మన దైనందిన కార్యకలాపాల నుండి మనల్ని దూరం చేస్తుంది అని, మరియు దేవునితో అనుబంధాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది అని, మరియు దేవుని సన్నిధిలో ప్రశాంతమైన, ప్రార్థనాపూర్వక వాతావరణంలో గడిపేలా చేస్తుందని అన్నారు.
ఇలాంటి క్షణాలు ఎల్లప్పుడూ మనం ఎదగడానికి సహాయపడతాయి అని, ఎందుకంటే వాటి ద్వారా "పరిశుద్ధాత్మ దేవునితో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మరియు ఆయనకు మరింత దగ్గరవ్వడానికి సహాయపడుతుంది" అని పరిశుద్ధ పోప్ లియో XIV గారు కొనసాగించారు.
పరిశుద్ధ పోప్ లియో XIV గారు, తన జూలై నెల ప్రార్థన ఉద్దేశ్యాన్ని కొనసాగిస్తూ , ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల బృందానికి "ఈ జీవితంలో మీలో ప్రతి ఒక్కరినీ ఒక ఉద్దేశ్యం మరియు లక్ష్యంతో దేవుడు సృష్టించాడు" అని చెప్పారు. వారి జూబ్లీ తీర్థయాత్రలో భాగంగా నగరంలోని అనేక పవిత్ర స్థలాలను సందర్శించమని ఆయన వారిని ప్రోత్సహించారు.
చివరిగా సమావేశం ముగింపులో, మరియ తల్లి మధ్యవర్తిత్వానికి మిమ్మల్ని అప్పగిస్తూ, మీలో ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ఆశీర్వాదాన్ని సంతోషంగా అందజేస్తున్నాను" అని పరిశుద్ధ పోప్ లియో XIV గారు అన్నారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer