కేరళ రాష్ట్రంలో భారత కతోలిక మండలి 15వ కార్యవర్గ సమావేశం
భారత కతోలిక మండలి 15వ కార్యవర్గ సమావేశం నవంబర్ 15న కేరళ రాష్ట్రము పాల నందు
జరిగింది ,
ఈ సమావేశం "భారతదేశ సామాజిక-రాజకీయ సంబంధింత పరిస్థితులలో దైవప్రజల కీలక పాత్ర" అనే అంశంపై కేంద్రీకృతమై ఉంది.
ఈ సమావేశంలో పీఠాధిపతులు,మతాధికారులు, మతపరమైన, సామాన్యులు మరియు ప్రముఖులు హాజరై భారతదేశ సమకాలీన సవాళ్లను పరిష్కరించడంలో సినడాలిటీ , ఐక్యత మరియు దైవప్రజల ద్యేయంపై ద్రుష్టి సారించారు.
కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియాస్ గారిచే దివ్యబలి పూజతో ఈ సమావేశం ప్రారంభమైంది, వీరు సినడాలిటీ నమూనాను గురించి తెలియచేసారు
విశ్వాసుల సామూహము, సినడ్ శ్రీసభ లక్ష్య సాధన కొరకు కలసి పనిచేయాలని కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియాస్ కోరారు.
ఇటీవల పొప్ గారు "సినడల్ శ్రీభలో దైవప్రజల ప్రాముఖ్యతను" నొక్కి వక్కాణించారు.
విశ్వాసం కలిగి ఉండటం, భాగస్వామ్యం , ఆచరణఆత్మకంగా మరియు సమ్మిళిత వృద్ధి శ్రీసభకు నాలుగు కీలక కోణాలు అని కార్డినల్ గ్రేసియాస్ అన్నారు .
CCI ప్రెసిడెంట్ మహా పూజ్య ఆండ్రూస్ థాజత్, రెండవ వాటికన్ కౌన్సిల్ సహ-బాధ్యత యొక్క దృష్టిని ప్రతిధ్వనించారు, క్రీస్తు ప్రేషిత కార్యం నెరవేర్చడంలో జ్ఞానస్నానం పొందిన సభ్యులందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
మైనారిటీ హక్కులను పరిరక్షించడం మరియు మత స్వేచ్ఛను పరిరక్షించడం, ముఖ్యంగా దళిత క్రైస్తవ అణగారింపు మరియు క్రైస్తవ హింస వంటి సవాళ్లను ఎదుర్కోవడం భారత శ్రీసభ విధిని ఆయన నొక్కి వక్కాణించారు.
మంత్రి జార్జ్ కురియన్ రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూనే దేశ నిర్మాణంలో శ్రీసభ చురుకుగా పాల్గొనడాన్ని ప్రోత్సహించారు.
మహా పూజ్య పీటర్ మచాడో రాష్ట్ర స్థాయిలో CCI సినడల్ నమూనాను ప్రతిపాదిస్తూ, మానవ హక్కులు మరియు మత స్వేచ్ఛ కోసం దృఢంగా వాదించాలని పిలుపునిచ్చారు.